డిచ్పల్లి, డిసెంబర్ 18 : కేంద్ర ప్రభుత్వం రైతుల జీవితాలతో ఆటలాడుతున్నదని, ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా నాటకాలాడుతున్నదని ధర్పల్లి జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్ విమర్శించారు. మండలంలోని కోరట్‌పల్లి, సుద్దులం, యానంపల్లి గ్రామాల్లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడారు. ప్రస్తుత పరిస్థితుల్లో వరికి బదులుగా ఇతర పంటలసాగుపై దృష్టిసారించాలని సూచించారు. అనంతరం పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చింత శ్రీనివాస్‌రెడ్డి, జడ్పీటీసీ ఇందిరాలక్ష్మీనర్సయ్య, రైతుబంధు సమితి కో-ఆర్డినేటర్ జీనియస్ నారాయణరెడ్డి, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు దండుగుల సాయిలు, విండో చైర్మన్లు గజవాడ జైపాల్, రామకృష్ణ, సీనియర్ నాయకులు పద్మారావు, నల్లవెల్లి సాయిలు, ఒద్దం నర్సయ్య, పులి వెంకటేశ్వరరావు, అంబర్‌సింగ్ రాథోడ్, ప్రధాన కార్యదర్శి నల్ల హరికిషన్, సూదం రాథోడ్, లక్ష్మీనారాయణ, సర్పంచులు ప్రమోద్, వెంకటేశ్, గోపు గంగాధర్, ఎంపీటీసీ సుజాతారవి, ఎస్సీసెల్ అధ్యక్షుడు ప్రమోద్, విద్యార్థి విభాగం నాయకుడు శ్రీకాంత్, ఉపసర్పంచ్ నవీన్‌రెడ్డి, గ్రామశాఖ అధ్యక్షులు లొక్కిడి ఆశన్న, జక్కు ప్రశాంత్, సంతోష్, నాయకులు రవీందర్‌రెడ్డి, మర్కంటి రవి, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
సిర్నాపల్లిలో..
ఇందల్వాయి, డిసెంబర్ 18 : యాసంగి సీజన్‌కు సంబంధించిన ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని ఎంపీపీ రమేశ్‌నాయక్, ఐడీసీఎంఎస్ చైర్మన్ సాంబారి మోహన్ అన్నారు. మండలంలోని సిర్నాపల్లిలో రైతులతో వారు సమావేశమై మాట్లాడారు. వరికి బదులుగా ఇతర పంటలను సాగు చేయాలని, పంటమార్పిడితో దిగుబడి పెరుగుతుందని అన్నారు. అనంతరం గ్రామానికి చెందిన పలువురు లబ్ధిదారుల ఇండ్లకు వెళ్లి కల్యాణలక్ష్మి చెక్కులను అందజేశారు. ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమపథకాలపై అవగాహన కల్పించారు. ఏ రాష్ట్రంలో లేనివిధంగా పేదింటి ఆడబిడ్డలకోసం సీఎం కేసీఆర్ కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను అమలు చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ బూసాని అంజయ్య, ఉపసర్పంచుల ఫోరం అధ్యక్షుడు మోహన్‌నాయక్, మండల అధ్యక్షుడు చిలువేరి గంగదాస్, సర్పంచ్ తేలు విజయ్‌కుమార్, ఉపసర్పంచ్ నవీన్‌గౌడ్, ఎంపీటీసీ కచ్చకాయల అశ్వినీశ్రీనివాస్, నాయకులు బిరీశ్, శంకర్‌గౌడ్, కుమార్, శ్రీనివాస్, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.
సిర్పూర్లో..
ఖలీల్‌వాడి (మోపాల్), డిసెంబర్ 17 : పంటమార్పిడితోనే రైతులకు లాభదాయకమని మోపాల్ మండలం సిర్పూర్ సర్పంచ్ ముత్యంరెడ్డి అన్నారు. గ్రామంలో రైతులతో ఆయన సమావేశమై మాట్లాడారు. పంటమార్పిడితో అధిక దిగుబడి వస్తుందని, వరికి బదులుగా ఇతర పంటలను సాగు చేయాలని సూచించారు.