హఫీజ్‌పేట్ :నేరాలనియంత్రణలో సీసీ కెమెరాలు ఎంతగానో దోహదం చేస్తాయని ప్రభుత్వవిప్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ అన్నారు. శుక్రవారం హఫీజ్‌పేట్ డివిజన్ పరిధిలోని ఉషోదయ ఎన్క్లేవ్ హెచ్ఐజీ ఫేజ్-2లో కాలనీవెల్ఫేర్అసోసియేషన్ అధ్వర్యంలో రూ.6లక్షల 70వేల వ్యయంతో నూతనంగా ఏర్పాటుచేసిన 32 సీసీ కెమెరాలను మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్లు, మియాపూర్ ఏసీపీ కృష్ణప్రసాద్ , కార్పొరేటర్లు పూజితగౌడ్, జగదీశ్వర్గౌడ్తోకలిసి ముఖ్యఅతిధిగా పాల్గోని ప్రారంభించారు.
ఈసందర్భంగా విప్‌గాంధీ మాట్లాడుతూ.. ఒక్కసీసీ కెమెరా వందమంది పోలీసులతో సమానం అని ప్రతికాలనీలో సీసీ ఏర్పాటుచేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతో ఉందన్నారు. సీసీ కెమెరాల ఏర్పాటుకు తనవంతు కృషిగా ఎమ్మెల్యే ఫండ్ద్వారా రూ. 1కోటి కేటాయించడం జరిగిందన్నారు. హెచ్ఐజీ కాలనీవాసుల భద్రతను దృష్టిలో ఉంచుకొని కాలనీవెల్ఫేర్ అసోసియేషన్ సొంతనిధులతో సీసీల ఏర్పాటుకు మందుకురావడం అభినందనీయమన్నారు.
ఈసందర్భంగా కాలనీ అసోసియన్ సభ్యులను ప్రత్యేకంగా అభినందించారు.అదేవిధంగా హెచ్ఐజీ కాలనీ అభివృద్ధిలోబాగంగా మెరుగైన మౌళిక వసతుల కల్పనకు కృషిచేస్తానని పేర్కోన్నారు. కార్యక్రమంలో ఎస్ఐలు రవికిరణ్, రవికుమార్, బీహెచ్ఈయల్ మాజీ ఎక్జిక్యూటివ్ డైరక్టర్ ఆర్కే వాంచూ, గౌతంగౌడ్, శ్రీనివాస్‌యాదవ్, అసోసియేషన్ సభ్యులు ప్రెసిడెంట్ నాగేశ్వరరావు, పూర్ణచందర్రావు, నర్సింహ, నాగేశ్వర్, శ్రీహరిరావు, సత్తిరాజు, బాలాజీనాయక్, కాలనీవాసులు పాల్గోన్నారు.