
జూలూరుపాడు, జనవరి 6: “సీఎం కేసీఆర్ స్వయానా రైతు. రైతుల కష్టనష్టాలేమిటో తెలుసు. అందుకే, రైతాంగ సంక్షేమానికి అధిక ప్రాధాన్యమిస్తున్నారు. అన్నివిధాలా ఆదుకుంటున్నారు. ‘రైతు బంధు’తో రైతు బాంధవుడిగా నిలిచారు. సీఎం కేసీఆర్, ఆయన ప్రభుత్వం చల్లగా ఉండాలని రైతులంతా ఆకాంక్షిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారు” అని వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములు నాయక్ అన్నారు. ‘రైతు బంధు’ సంబురాల్లో భాగంగా స్థానిక జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం వ్యాస రచన, వక్తృత్వ, ముగ్గుల పోటీలను పరిశీలించారు. విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. యాసంగి సాగు కోసం మండలంలోని 8,414 మంది రైతులకు రూ.9.68 కోట్లు మంజూరైనట్లు తెలిపారు. రైతు బంధు సంబురాల్లో రైతులంతా పాల్గొని, ప్రభుత్వానికి అండగా నిలవాలని కోరారు. రైతుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తూ, దేశానికే ఆదర్శంగా నిలుస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ప్రతి ఒక్క రైతు, వారి కుటుఒంబం అభినందించాలని, ఆశీర్వదించాలని కోరారు. కార్యక్రమంలో సహకార సంఘం అధ్యక్షు డు లేళ్ల వెంకటరెడ్డి, రై తు బంధు సమితి మం డల కన్వీనర్ యదళ్లప ల్లి వీరభద్రం, వ్యవ సాయ శాఖ సహాయ సంచాలకురాలు తుమ్మలపల్లి కరుణశ్రీ, వ్యవసాయాధికారి రఘు దీపిక, తహసీల్దార్ లూథర్ విల్సన్, ఎంపీడీవో చంద్రశేఖర్, జడ్పీటీసీ సభ్యుడు భూక్యా కళావతి, ఎంపీటీసీ సభ్యులు పెండేల రాజశేఖర్, దుద్దుకూరి మధుసూదన్‌రావు, నాయకులు దొండపాటి శ్రీనివాసరావు, రామిశెట్టి రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
చుంచుపల్లి: మండలంలోని గరిమెళ్లపాడు ఉద్యాన నర్సరీలో జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ అధికారి జినుగు మరియన్న ఆధ్వర్యంలో గురువారం సంబురాలు జరిగాయి. పిల్లలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. అధికారులు అబ్దుల్ అలీం, నరేందర్, శ్రీనివాసరావు, పృథ్వి, విజయ్‌కుమార్, కామేశ్వరరావు, పి.పాపారావు, ఎస్.కృష్ణ, సత్యనారాయణ, భద్రయ్య, పీఎల్ నారాయణ, బజారు పాల్గొన్నారు.
పాల్వంచ: వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో పాల్వంచ పట్టణం, మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో గురువారం ముగ్గుల పోటీలు జరిగాయి. విజేతలకు బహుమతులను ఏ ఈవో అందజేశారు. హెచ్ఎం ప్రకాశరావు తదితరులు పాల్గొన్నారు.
పాల్వంచ రూరల్: ‘రైతు బంధు’పై మండలంలోని పాండురంగాపురం, జగన్నాథపురం రైతు వేదికల్లో విద్యార్థులకు వ్యాస రచన పోటీలు జరిగాయి. వైస్ ఎంపీపీ మార్గం గురవయ్య, ఏవో శంకర్, ఏఈవోలు శాంతి, భాను, అనురిక, సత్యం పాల్గొన్నారు.
కొత్తగూడెం ఎడ్యుకేషన్: పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో ముగ్గుల పోటీ విజేతలకు బహుమతులను మున్సిపల్ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి అందజేశారు. కౌన్సిలర్ బండారి రుక్మాంగధర్, హెచ్ఎం గుంటి రమాదేవి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
లక్ష్మీదేవిపల్లి: మండలంలోని హేమచంద్రాపురం ఉన్నత పాఠశాలలో ముగ్గులు, వ్యాస రచన పోటీ విజేతలకు బహుమతులను మండల వ్యవసాయ అధికారి రాకేష్ అందజేశారు. హెచ్ఎం లీల, వ్యవసాయ విస్తరణ అధికారులు నవ్య, లత, పవన్ పాల్గొన్నారు.