
నార్కట్పల్లి, జనవరి 2 : మండలంలోని చెర్వుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి ఆలయం భక్తజన సంద్రంగా మారింది. కొత్త సంవత్సరం, ఆదివారం అమావాస్య కావడంతో వివిధ ప్రాంతాల నుంచి భారీగా వచ్చిన భక్తులు స్వామి
వారిని దర్శించుకున్నారు. అమావాస్య సందర్భంగా పార్వతీ పరమేశ్వరుల ఉత్సవ విగ్రహాలకు ఆలయ ప్రధానార్చకుడు పోతులపాటి రామలింగేశ్వరశర్మ ఆధ్వర్యంలో లక్ష పుష్పార్చన ఘనంగా నిర్వహించారు. భక్తులకు ఇబ్బందులు కలుగకుండా ఆలయ చైర్మన్ మేకల అరుణారాజిరెడ్డి మౌలిక వసతులు కల్పించారు.