మియాపూర్ : అగ్రరాజ్యం అమెరికా దేశంలోని అట్లాంటా నగరంలో ఎంగిలిపూల బతుకమ్మ సంబురాలు ఘనంగా జరిగాయి. అట్లాంటా తెలుగు అసోసియేషన్ మహిళా ప్రతినిధులు, తెలుగు మహిళలు, చిన్నారులు బతుకమ్మలను అందంగా పేర్చి బతుకమ్మ పాటలతో ఆడి పాడి వేడుకలను ఉత్సాహంగా జరుపుకున్నారు.
తమ ఇండ్లలో పూసిన పూలతోనే బతుకమ్మలను పేర్చుకుని ఉత్సవాలను ప్రారంభించినట్లు నిర్వహకులు ఆవంచ లలిత, శిరీషలు పేర్కొన్నారు.