జూబ్లీహిల్స్ : యూసుఫ్‌గూడ చెక్‌పోస్ట్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మంగళవారం బతుకమ్మ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. పాఠశాల ఇంచార్జ్ హెచ్ఎం నరసింహ ఆధ్వర్యంలో ఉపాధ్యాయినీలు, విద్యార్థినీలు రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి సంప్రదాయ దుస్తులు ధరించి బతుకమ్మలు ఆడారు.
బుధవారం నుంచి పాఠశాలలకు దసరా సెలవులు ప్రకటించడంతో చివరిరోజున విద్యార్థినీలు బతుకమ్మ పాటలు పాడుతూ సందడి చేశారు.