సైదాబాద్ : దిల్సుఖ్నగర్ గడ్డి అన్నారంలోని నేషనల్ సెంటర్ ఆఫ్ ఇండియన్ మెడికల్ హెరిటేజ్ (ఎన్సీఐఎంహెచ్)ను గురువారం ఆయుష్ మంత్రిత్వశాఖ సెక్రటరీ పద్మశ్రీ డాక్టర్ రాజేశ్ కొటెచా, స్పెషల్ టెక్నికల్ ఆఫీసర్ డాక్టర్ సుమీత్ గోయల్‌లు సందర్శించారు. ఈ సందర్భంగా పద్మశ్రీ వైద్య రాజేశ్ కొటెచా మాట్లాడుతూ ఆయుష్ వైద్య వారసత్వ సంపదను కాపాడటానికి సంస్థ చేపడుతున్న కార్యకలాపాలను ఆయన ప్రసంశించారు. వాటిని ముందుకు తీసుకెళాల్సిన అవశ్యకతను వివరించారు.
ఇనిస్టిట్యూట్ మెడికో-హిస్టారికల్ లైబ్రరీ, మ్యూజియాన్ని సందర్శించి సంస్థలోని మ్యూజియాన్ని గురించి ప్రజలలో సరియైన అవగాహన కల్పించాలని కోరారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఆయుష్ ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు. అంతకుముందు వారికి సంస్ధ అసిస్టెంట్ డైరెక్టర్ ఇంచార్జీ డాక్టర్ జి.పి ప్రసాద్, సిబ్బంది స్వాగతం పలికారు.ఈ కార్యక్రమంలో సంస్థ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.