ముషీరాబాద్ : ముషీరాబాద్ డివిజన్ రాంనగర్ బ్రహ్మంగారి టెంపుల్ సమీపంలో చేపడుతున్న ఓ అక్రమ భవన నిర్మాణాన్ని జీహెచ్ఎంసీ సర్కిల్-15 టౌన్‌ప్లానింగ్ అధికారులు బుధవారం కూల్చివేశారు. టౌన్‌ప్లానింగ్ నిబంధనలకు విరుద్దంగా అదనపు అంతస్తులు నిర్మించడంతో స్థానికులు చర్యలు తీసుకోవాలంటూ టౌన్‌ప్లానింగ్ అధికారులకు ఫిర్యాదు చేశారు.
ఈ మేరకు సర్కిల్-15 టౌన్‌ప్లానింగ్ ఏసీపీ పావని ఆదేశాల మేరకు సిబ్బంది అక్రమ నిర్మాణాన్ని కూల్చివేశారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది అనిల్, జగన్, రాజయ్య తదితరులు పాల్గొన్నారు.