
తువేదికల ఎదుట సంక్రాంతిని తలపిం చేలా ముగ్గులు.. విద్యాలయాల్లో వ్యాస రచన పోటీలు.. ఊరూరా పండుగ వాతావ రణం.. ఎక్కడికక్కడ ముఖ్యమంత్రి ఫ్లెక్సీలకు క్షీరాభిషేకం.. రైతుల ముఖాల్లో ఎనలేని ఆనం దం.. ఇవన్నీ సీఎం కేసీఆర్ రైతుల కోసం తీసుకొ చ్చిన రైతుబంధు సాయం సంబురం.. ఉమ్మడి మెదక్ జిల్లాల్లో రైతుబంధు వేడుకలు ఉత్సా హంగా జరుగుతున్నాయి. ‘జై తెలంగాణ.. జై కేసీఆర్.. అనే నినాదాలతో పల్లెలు మార్మోగు తున్నాయి.
కర్షకుడు కష్టపడితేనే నోటికి బుక్కెడు బువ్వ దొరికేది.. అన్నదాత చెమట చుక్కలతో పండించే ధాన్యం పుట్లను చూస్తే కడుపు నిండినంత సంతోషంగా ఉంటుంది. అలాంటి అన్నదాత కష్టం పంట పెట్టుబడి నుంచే ప్రారంభమయ్యేది. రైతన్నలకు వెన్నంటే నిలిచి వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చిన రైతుబంధు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా రైతుబంధు వారోత్సవాలను నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని మెతుకు సీమలో ఉత్సాహంగా నిర్వహిస్తున్నారు. రైతులే కాకుండా విద్యార్థులు, మహిళలు, అధికారులు, ప్రజాప్రతినిధులు ఆయా కార్యక్రమాల్లో మేము సైతం అంటూ పాల్గొంటున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ముగ్గులు, వ్యాస రచనలు, సీఎం కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకాలు చేస్తూ రైతుబంధు ఖ్యాతిని చాటిచెబుతున్నారు. పలుచోట్ల కళాకారులు రైతుబంధు పథకం గురించి వివరిస్తూ ఆడిపాడుతున్నారు.
సిద్దిపేట అర్బన్, జనవరి 5: గ్రామగ్రామానా రైతుబంధు పండుగ కొనసాగతున్నది. రైతు దశదిశ మార్చే పథకం తెచ్చిన గొప్ప వ్యక్తి సీఎం కేసీఆర్ అని ప్రతి పల్లె మురిసిపోతున్నది. నాడు గోస పెట్టిన ప్రభుత్వాలను చూసిన రైతులు, నేడు రైతును కడుపులో పెట్టుకుంటున్న ప్రభుత్వాన్ని చూసి భావోద్వేగానికి గురవుతున్న సందర్భం కనిపిస్తున్నది. పంట పెట్టుబడి సాయం కింద ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎనిమిదో విడత రైతుబంధులో భాగంగా గత నెల 28వ తేదీ నుంచి రైతుల వ్యక్తిగత బ్యాంక్ ఖాతాల్లో రాష్ట్ర ప్రభుత్వం డబ్బులను జమ చేస్తున్నది. ఇందులో భాగంగా ఏడో రోజు బుధవారం ఏడెకరాల వరకు ఉన్న రైతులకు రైతుబంధు డబ్బులను ప్రభుత్వం రైతుల ఖాతాల్లో వేసింది. యాసంగి సాగు పెట్టుబడికి రైతులు ఈ డబ్బులు ఉపయోగించుకుంటున్నారు. దీంతో జిల్లాలోని అన్ని ఏటీఎంల వద్ద, బ్యాంకుల వద్ద రైతుల సందడి ఎక్కువగా కనిపిస్తున్నది. ఏడోరోజు సిద్దిపేట జిల్లాలో 2,157 మంది రైతులకు గానూ రూ.6,29,69,800, మెదక్ జిల్లాలో 1,011 మందికి గానూ రూ.2,74,97,237, సంగారెడ్డి జిల్లాలో 2,739 మంది రైతులకుగానూ రూ.8,19,44,161 ప్రభుత్వం జమ చేసింది. మొత్తం ఉమ్మడి జిల్లాలో ఏడో రోజు 5,907 మంది రైతులకు రూ.17,24,11,198ను రైతుల బ్యాంక్ ఖాతాలో రాష్ట్ర ప్రభుత్వం వేసింది. కాగా, ఈ ఏడు రోజుల్లో సిద్దిపేట జిల్లాలోని 2,84,505 మంది రైతులకుగానూ రూ.263,10,03,622, మెదక్ జిల్లాలో 2,28,974 మంది రైతులకుగానూ రూ.171,96,86,503, సంగారెడ్డి జిల్లాలో 3,03,506 మంది రైతులకుగానూ రూ.289,36,93,975 జమ చేయగా, మొత్తం ఉమ్మడి జిల్లాలో బుధవారం వరకు 8,16,985 మంది రైతులకుగానూ రూ.724,43,84,100 నగదును రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేసింది.
రైతుబంధు గొప్ప పథకం..
రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ వంగ నాగిరెడ్డి
సిద్దిపేట అర్బన్, జనవరి 5: అన్నదాతలను ఆదుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వానికి రైతులు ఎల్లవేళలా అండగా ఉంటారని రైతుబంధు సమితి సిద్దిపేట జిల్లా కన్వీనర్ వంగ నాగిరెడ్డి అన్నారు. రైతుబంధు సంబురాల్లో భాగంగా సిద్దిపేట అర్బన్ మండలం మిట్టపల్లి రైతువేదిక, సిద్దిపేట రూరల్ మండలం చిన్నగుండవెళ్లి, రాఘవాపూర్ రైతువేదికల వద్ద జరిగిన సంబురాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ నాగిరెడ్డి మాట్లాడుతూ భావితరాలకు ఆదర్శంగా నిలిచిన రైతుబంధు పథకం ఎంతో గొప్పదని, చరిత్రలో చెరగని ముద్ర వేస్తుందన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ శ్రీదేవి చందర్రావు, మండల వ్యవసాయాధికారి పరుశరాంరెడ్డి, ఆయా గ్రామాల ఏఈవోలు, రైతుబంధు సమితి సభ్యులు పాల్గొన్నారు.
తోరణం కట్టి… ముగ్గులు పెట్టి…
గజ్వేల్, జనవరి 5: రైతువేదికకు తోరణం కట్టి, వేదిక ముందు ప్రాంగణమంతా ముగ్గులు పెట్టి రైతులు కొండపాక మండలం మర్పడగ గ్రామంలో బుధవారం ఘనంగా రైతుబంధు సంబురాలు జరుపుకొన్నారు. తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు రైతుబంధుపై వివరిస్తూ ఇచ్చిన ప్రదర్శనలు రైతుల్లో మరింత ఉత్సాహాన్ని నింపుతూ పండుగ వాతావరణాన్ని నెలకొల్పాయి. గ్రామసర్పంచ్ రజితరాజిరెడ్డి ఆధ్వర్యంలో రైతు వేదిక వద్ద సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో రైతుబంధు మండలాధ్యక్షుడు ర్యాగళ్ల దుర్గయ్య, ఎంపీటీసీ పత్తి ఆంజనేయులు, ఉపసర్పంచ్ యాదగిరి, ఏవో విష్ణు, తెలంగాణ సాంస్కృతిక సారథి ఏడీ దశరథం, జిల్లా కళాకారులు పిల్లుట్ల శ్యాంసుందర్, హరిప్రసాద్, వెంకటాపురం రవి, నల్లనాగుల శశి ప్రియ, రాచపల్లి శైలజ, కొమ్ము రవీందర్, ఏర్పుల నర్సయ్య, నీరటి రవీందర్, డప్పు కళాకారులు ఏర్పుల తిరుమలయ్య, కొమ్ము ఎల్లం, ఏర్పుల నర్సింలు, ముదిగొండ నర్సింలు, వీవీ కన్నా, తండా భిక్షపతి తదితరులు పాల్గొన్నారు.