మన్సూరాబాద్ : మన్సూరాబాద్ పెద్దచెరువులో వినాయక నిమజ్జనాల కోసం ఏర్పాట్లు పూర్తి చేశామని ఎంఆర్డీసీ చైర్మన్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి తెలిపారు. మన్సూరాబాద్ డివిజన్ పరిధి సరస్వతినగర్ కాలనీ సమీపంలోని పెద్దచెరువు ప్రాంగణంలో నిమజ్జనాల కోసం సిద్ధం చేసిన కొలనును గురువారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భారీ వినాయకులను సైతం నిమజ్జనం చేసేందుకు రెండు క్రేన్లను సిద్ధం చేసి ఉంచామని తెలిపారు.
పోలీసులు, జీహెచ్ఎంసీ, రెవెన్యూ సిబ్బంది సమన్వయంగా పనిచేస్తూ వినాయక నిమజ్జనాలను సాఫీగా సాగించేందుకు చర్యలు చేపడుతున్నారని తెలిపారు. మన్సూరాబాద్ పెద్దచెరువులో ఇప్పటికే ఏడు వేల విగ్రహాలను నిమజ్జనం చేయడం జరిగిందని.. ఆదివారం చివరి రోజున పెద్ద ఎత్తున నిమజ్జనాలు జరిగే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ కొప్పుల విఠల్‌రెడ్డి, డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు టంగుటూరి నాగరాజు, నాయకులు జక్కిడి రఘువీర్ రెడ్డి, సిద్దగోని జగదీష్ గౌడ్, బాలరాజు గౌడ్, ఆనంద్‌కుమార్, కంచర్ల రాకేష్‌రెడ్డి, నరి వెంకన్న కురుమ, నరి అంజయ్య కురుమ, పారంద నర్సింగ్‌రావు, రుద్ర యాదగిరి, టి. మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.