ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్
గ్రామాల్లో సీఎం కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేసిన అన్నదాతలు, నాయకులు
కామారెడ్డి, డిసెంబర్ 30 : రైతుల సంక్షేమం కోసం ఎన్నో పథకాలను అమలుచేస్తూ సీఎం కేసీఆర్ ఆపద్బాంధవుడయ్యారని ప్రభుత్వ విప్, కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ అన్నారు. రైతుబంధు పథకంలో భాగంగా ఎనిమిదో విడుత పెట్టుబడి సాయం రైతుల ఖాతాల్లో జమకావడంపై రైతులు, నాయకులు సంతోషం వ్యక్తం చేశారు.
జిల్లాకేంద్రంలోని నిజాంసాగర్ చౌరస్తాలో విప్ గంప గోవర్ధన్ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి రైతులు, నాయకులు క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా విప్ మాట్లాడుతూ.. ఏడాదిలో రెండు సీజన్లకూ సీఎం కేసీఆర్ పెట్టుబడి సాయాన్ని అందిస్తూ రైతులకు అండగా నిలుస్తున్నారన్నారు. వ్యవసాయరంగాన్ని ప్రోత్సహిస్తూ రైతులకు మేలు చేకూరేలా ఎన్నో కార్యక్రమాలు, పథకాలను అమలుచేస్తున్నారన్నారు.
స్వరాష్టంలో సీఎం కేసీఆర్ కృషి ఫలితంగా పంటల సాగు రెట్టింపు అయ్యిందన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మైనార్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎంకే ముజీబుద్దీన్, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు నిట్టు వేణుగోపాల్ రావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పున్న రాజేశ్వర్, కామారెడ్డి పట్టణ అధ్యక్షుడు జూకంటి ప్రభాకర్ రెడ్డి, కామారెడ్డి ఎంపీపీ పిప్పిరి ఆంజనేయులు, టీఆర్ఎస్ పట్టణ ప్రధాన కార్యదర్శి లక్ష్మీపతియాదవ్, పట్టణ మాజీ అధ్యక్షుడు గడ్డం చంద్రశేఖర్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ గ్యార లక్ష్మీసాయిలు, వైస్ చైర్మన్ కుంబాల రవి, కౌన్సిలర్లు కృష్ణాజీరావు, హఫీజ్ బేగ్, అంజల్రెడ్డి, కాసర్ల స్వామి, మాసుల లక్ష్మీనారాయణ, కన్నయ్య, శంకర్ రావు, ప్రసన్న తదితరులు పాల్గొన్నారు.