మణుగూరు రూరల్/ సారపాక, జనవరి 2 : రైతుబంధు డబ్బుల విడుదలను హర్షిస్తూ రైతులు, టీఆర్ఎస్ నాయకులు సీఎం కేసీఆర్ చిత్రపటానికి ఆదివారం క్షీరాభిషేకం చేశారు. మణుగూరు మండలంలోని తిర్లాపురం రైతువేదికలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ముత్యం బాబు, పట్టణ పరిధిలోని కమలాపురంలో పార్టీ పట్టణాధ్యక్షుడు ఆడపా అప్పారావు ఆధ్వర్యంలో క్షీరాభిషేకాలు జరిగాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ రైతు పక్షపాతి అని, రైతు బంధు, రైతుబీమాతోపాటు అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని అన్నారు. మణుగూరు పీఏసీఎస్ అధ్యక్షుడు కుర్రి నాగేశ్వరరావు, పార్టీ ప్రధాన కార్యదర్శి రామిడి రామిరెడ్డి, డీసీసీబీ మాజీ డైరెక్టర్ బోయిళ్ల రమణయ్య, మత్స్యకార సంఘం డైరెక్టర్ చీడెం నాగేశ్వరరావు, తిర్లాపురం ఉపసర్పంచ్ కంటెం సురేశ్, రామానుజవరం ఉప సర్పంచ్ తడకమళ్ల ప్రభుదాస్, పార్టీ మహిళా నాయకురాలు రమ, నాయకులు పెండ్యాల నాగేశ్వరరావు, బొగ్గుల నాని, బత్తిని చందర్రావు, కోటయ్య, బోయిళ్ల రాజు, మండారి సతీశ్, పలువురు రైతులు పాల్గొన్నారు. సారపాక మండలంలోని మోతే పట్టీనగర్‌లో టీఆర్ఎస్ నాయకులు, రైతులు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ రైతుల గుండెల్లో నిలిచిపోయారని ప్రభుత్వ పాలనను కొనియాడారు. కార్యక్రమంలో జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత, ఏఎంసీ చైర్పర్సన్ పొడియం ముత్యాలమ్మ, మండల అధ్యక్షుడు గోపిరెడ్డి రమణారెడ్డి, ప్రధాన కార్యదర్శి జక్కం సుబ్రహ్మణ్యం, మహిళా అధ్యక్షురాలు ఎల్లంకి లలిత, టీఆర్ఎస్ అధికార ప్రతినిధి నల్లమోతు సురేశ్, సర్పంచ్ పోతునూరి సూరమ్మ, మాజీ జడ్పీటీసీ భూపెల్లి నర్సింహారావు, టీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షుడు బండారు లక్ష్మీనారాయణ, వెంకటేశ్వరరెడ్డి, టీఆర్ఎస్ మైనార్టీ అధ్యక్షుడు షేక్ సాధిక్‌పాషా, పార్టీ మోతే గ్రామాధ్యక్షుడు గుదె వెంకటనర్సింహారావు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ బానోత్ శ్రీను, పొడియం నరేందర్, కుర్సం వెంకన్న, బొర్రా రాఘవులు, సుధాకర్‌రెడ్డి, లక్ష్మీరెడ్డి, జాబిల్లి పాల్గొన్నారు.