వికారాబాద్, డిసెంబర్ 6 : భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వర్ధంతిని సోమవారం వికారాబాద్ పట్టణంలో మున్సి పల్ అధికారులు, ప్రజా ప్రతినిధులు, నాయకులు నిర్వహించారు. పట్టణంలోని రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి, మున్సిపల్ కార్యాలయంలోని చిత్రపటానికి మున్సిపల్ చైర్పర్సన్ మంజుల పూల మాలలు వేసి నివాళులర్పించారు. కార్య క్రమంలో కమిషనర్ శరత్చంద్ర, మున్సిపల్ వైస్ చైర్పర్సన్ శం షాద్బేగం, పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డి, మున్సి పల్ మాజీ వైస్ చైర్మన్ రమేశ్‌కుమార్, కౌన్సిలర్లు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.
ధారూరు మండలంలో..
ధారూరు, డిసెంబరు06 : మండల కేంద్రంతో పాటు, ఆయా గ్రా మాల్లో అంబేద్కర్ విగ్రహాలు, చిత్రపటాలకు పలువురు పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్బంగా నాయకులు మాట్లాడుతూ అంబేద్కర్ దేశానికి చేసిన సేవలు మరువ లేనివ న్నారు. కార్యక్రమంలో ఎంపీపీ జైదు పల్లి విజయలక్ష్మి, ఎంపీడీవో ఉమాదేవి, ఎంపీవో షఫీ ఉల్లా, వైస్ ఎంపీపీ విజయ్‌కమార్, ఎంపీటీసి బసప్ప, నాయకులు హన్మంత్‌రెడ్డి, వెంకట్రాంరెడ్డి రాఘవేందర్ రెడ్డి, నర్సిరెడ్డి, నారాయణ పాల్గొన్నారు.
బొంరాస్‌పేటలో..
బొంరాస్‌పేట, డిసెంబర్ 6 : మండల కార్యాలయాల ఆవరణలో, నాం దార్పూర్, రేగడిమైలారం, చిల్ముల్మైలారం, లగచెర్ల, గౌరారం గ్రామాల్లో అంబేద్కర్ విగ్రహాలకు ప్రజా సంఘాల నాయ కులు, అంబేద్కర్ యువజన సంఘాల నాయకులు, ప్రజాప్రతి నిధులు పూల మాలలు వేసి నివాళులర్పించారు. అంబేద్కర్ సేవలను కొనియాడారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ హక్కు ల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు చంద్రయ్య, ఎల్‌హెచ్‌పీఎస్ జిల్లా అధ్యక్షుడు సూర్యానాయక్, రజక సంఘం జిల్లా అధ్యక్షుడు రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
రోగులకు పండ్లు పంపిణీ
మర్పల్లి, డిసెంబర్ 6: మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామాల్లో యువజన సంఘం సభ్యులు అంబేద్కర్ విగ్రహానికి, చిత్రపటానికి పూలమాలలు వేశారు. ప్రభుత్వ దవాఖానలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూప్రతి ఒక్కరూ ఆయన అడుగుజాడల్లో నడువాలని పిలుపునిచ్చారు.
దౌల్తాబాద్మండలంలో..
దౌల్తాబాద్, డిసెంబర్ 6: దౌల్తాబాద్ మండల వ్యాప్తంగా డాక్టర్ అంబేద్కర్ వర్ధంతిని నిర్వహించారు.మండల కేం ద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి జడ్పీటీసీ కోట్ల మహిపాల్ పూల మాలవేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో మార్కెట్ కమి టీ మాజీ చైర్మన్ బాయిరెడ్డి నరోత్తంరెడ్డి, ఎంపీటీసీ శివమ్మ, నరేశ్ , కిషన్‌నాయక్, నరహరి, భాను, విజయ్ దళితసంఘానాయకులు టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు
బార్వాద్ గ్రామంలో…
కోట్‌పల్లి, డిసెంబర్ 6 : బార్వాద్ గ్రామంలో ఎంపీటీసీ నర్సిం హా రెడ్డి ఆధ్వర్యంలో అంబేద్కర్ వర్ధంతిని నిర్వహించారు. ఈ సంద ర్భంగా మాట్లాడుతూ అణగారిన వర్గాలకు ఆయన చేసిన సేవలను గుర్తు చేశారు. కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.
దేశానికి మార్గదర్శనం..
బంట్వారం, డిసెంబర్6 :మండల కేంద్రంతో పాటు, తొరు మా మిడి, బొపునారం, రొంపల్లి, సల్బత్తాపూర్, కుంచావరం, పోచారం తదితర గ్రామాల్లో ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయాలు, పాఠ శాలలలో, సంఘ సంస్థలలో ఆయా ప్రముఖులు అంబేద్కర్ విగ్ర హాలు, చిత్రపటాలకు పూలమాలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ దేశానికి మార్గదర్శనం అంబేద్కర్‌దేనని చెప్పారు. కార్యక్రమంలో ఎంపీపీ ప్రభాకర్, ఎం పీడీవో బాలయ్య, ఎంపీవో విజయకుమార్, శ్రీనివాస్, నేతలు నర్సింహులు, బిచ్చప్ప, మల్లేశం, దినేశ్, జనార్దన్ పాల్గొన్నారు.
నవాబ్‌పేట మండలంలో..
నవాబుపేట,డిసెంబర్6: మండల కేంద్రంలోని వివిధ గ్రామాల్లో అంబేద్కర్ వర్ధంతిని దళిత నాయకులు, కుల సంఘాల వారు నిర్వహించారు. కేవీపీఎస్ మండల అధ్యక్షుడు మాణిక్యం ఉపాధ్యక్షులు పరమేశ్, శివశంకర్ నర్సింహులు, గోవర్ధన్, రాములు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు.