పహాడీషరీఫ్ : యువకులు క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్ ఉంటుందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. జనవరి 2న జల్పల్లి యువకులు, విద్యార్థులు కలిసి జల్పల్లి ప్రీమియం లీగ్ (జె.పి.ఎల్)గా ఏర్పడి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. ఇందులో 6 టీమ్‌లుగా కాగా 19 మ్యాచ్‌లు ఆడడం జరిగింది.
ఆదివారం ఫైన్ల్ మ్యాచ్‌లో సూపర్ కింగ్ టీమ్, టైగర్ టీమ్ తలపడగా సూపర్ కింగ్ టీమ్ విజయం సాధించింది. ఆదివారం మంత్రి సబితా ఇంద్రారెడ్డి జల్పల్లికి విచ్చేసి విజయం సాధించిన సూపర్ కింగ్ టీమ్‌కు ట్రోపీ అందజేశారు.
అనంతరం క్రికెట్ టీమ్‌కు సహకరించిన జల్పల్లి మున్సిపాలిటీ కమిషనర్ జి.పి కుమార్, స్థానిక నాయకులు మాజీ ఎంపీటీసీలు యంజాల జనార్థన్ తదితరులను శాలువతో సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ యవత క్రీడల పట్ల ఆసక్తి పెంచుకొని రాణించాలన్నారు. మానసిక ఉల్లాసానికి క్రీడలు ఎంతగానో ఉపయోగపడుతాయన్నారు.
ఆటలు ఆడటం వల్ల చురుకుదనం, కలిసి ఉండాలనే భావన పెరుగుతుందన్నారు. నాయకత్వ లక్షణాలు అలవడుతాయన్నారు. క్రీడలకు టీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో జె.పి.ఎల్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహకులు సూరెడ్డి వినయ్‌రెడ్డి, వినయ్‌గౌడ్, దేవేందర్, లడ్డు, శివ, విశ్వనాథ్‌గౌడ్ పాల్గొన్నారు.