
రామన్నపేట, జనవరి 28 : పల్లెప్రగతి కార్యక్రమంతో గ్రామాల్లో గణనీయమైన మార్పు వచ్చిందని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. మండలంలోని దుబ్బాక, ఎన్నారం, కుంకుడుపాముల, సూరారం గ్రామాల్లో రూ.40 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులకు శుక్రవారం శంకుస్థాపన చేశారు. దుబ్బాక, సూరారం గ్రామాల్లో వైకుంఠధామాలను ప్రారంభించారు. అనంతరం గ్రామాల్లో తిరుగుతూ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సూరారం గ్రామంలో టీఆర్ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. కుంకుడు పాములలో లింగమంతులస్వామి దేవాలయ పునరుద్ధరణకు రూ.50,116 విరాళం అందజేశారు. దుబ్బాక గ్రామాభివృద్ధికి 50లక్షలు కేటాయిస్తానని హామీఇచ్చారు.
ఇంటివద్దే సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ
సీఎం సహాయనిధి చెక్కులను ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య బాధితుల ఇండ్లకు వెళ్లి అందజేశారు. దుబ్బాకకు చెందిన గట్టు శ్రీనుకు రూ.56వేలు, పల్లివాడలో దండిగ మంజులకు రూ.18వేలు, కల్లెం అర్పితకు రూ.32వేలు, బాచుప్పలకు చెందిన ఆవుల మత్స్యగిరికి రూ.44వేలు, సతీశ్‌కు రూ.52వేలు, సూరారం గ్రామానికి చెందిన లావణ్యకు 24వేల చెక్కులను అందజేశారు. ఎంపీపీ కన్నెబోయిన జ్యోతీబలరాం, సింగిల్‌విండో చైర్మన్ నంద్యాల భిక్షంరెడ్డి, సర్పంచులు నీల జయలక్ష్మి, మెట్టు మహేందర్‌రెడ్డి, బొక్క పురుషోత్తంరెడ్డి, పోచబోయిన ఆండాలు, ఎంపీటీసీలు ఏనుగు పుష్పలత, దోమల సతీశ్, ఎండీ అమేర్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ఉదయ్‌రెడ్డి, నాయకులు జగన్మోహన్, రాములు, మల్లేశం, మహేందర్‌రెడ్డి, పృథ్వీరాజ్, శ్రీనివాస్, కృష్ణవేణి పురుషోత్తంరెడ్డి, సాయికుమార్ పాల్గొన్నారు.