
ఎమ్మెల్యే భాస్కర్‌రావు
మిర్యాలగూడ టౌన్, జనవరి 28 : మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రిలో వసతుల కల్పనకు ప్రభుత్వం రూ.74 లక్షలు మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు తెలిపారు. శుక్రవారం ఆస్పత్రిని ఆయన జిల్లా వైద్యాధికారులు అజీజ్, లోకిలాల్, మాతృనాయక్‌తో కలసి సందర్శించారు. ఆస్పత్రిలోని అన్ని వార్డులు తిరిగి రోగుల ఇబ్బందులను, వైద్యులు అందిస్తున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ చిన్నపిల్లల వార్డులో అధునాతన సౌకర్యాలు, సిటీ స్కానింగ్ విభాగం వంటి సేవలను ఏర్పాటు చేసి అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. ఆస్పత్రిలో నిరంతర విద్యుత్ అందించించేందుకు అదనపు ట్రాన్స్‌పార్మర్‌ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. వైద్యులు అందుబాటులో ఉండి రోగులకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. ఆయన వెంట ఆస్పత్రి సూపరింటెండెంట్ సమరద్ ఉన్నారు.
సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ
మిర్యాలగూడ : వేములపల్లి మండలం మొల్కపట్నం గ్రామానికి చెందిన జెర్రిపోతుల గిరిబాబుకు రూ.3 లక్షలు, వేములపల్లికి చెందిన మల్లికంటి సతీశ్‌కు రూ. 60వేల సీఎం సహాయనిధి చెక్కులు మంజూరు కాగా మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్‌రావు తన క్యాంపు కార్యాలయంలో అందించారు. కార్యక్రమంలో మొల్కపట్నం సర్పంచ్ నామిరెడ్డి కరుణాకర్‌రెడ్డి, గొవింద్, బాధిత కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.