
ఖమ్మం సిటీ, జనవరి 27: ఖమ్మంలోని సంకల్ప సీ స్టార్ హాస్పిటల్లో క్యాథ్లాబ్, ఎముకలకు సంబంధించి అరుదైన వైద్యసేవలు అందిస్తున్నామని కార్డియాలజిస్ట్ డాక్టర్ సీతారాం, హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ వీరేశ్వర్ పేర్కొన్నారు. గురువారం సాయంత్రం ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. దవాఖానలో గత అక్టోబర్ నుంచి గుండె వైద్య సేవలు ప్రారంభించామన్నారు. ఇటీవల 21 ఏళ్లున్న మహిళకు రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లెలేషన్ చికిత్స ద్వారా తీవ్రమైన గుండె దడ సమస్యను తొలగించామన్నారు. రెండు రోజుల క్రితం 65 ఏళ్ల వయస్సున్న వ్యక్తి గుండె బలహీనతను సరిచేసేందుకు మూడు అత్యాధునిక సూక్ష్మ పరికరాలను (సీఆర్టీడీ ప్రొసెడ్యూర్) గుండె లోపల అమర్చామన్నారు. ప్రస్తుతం వారిద్దరూ పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని స్పష్టం చేశారు. హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ రవికుమార్, హాస్పిటల్ డైరెక్టర్లు డాక్టర్ గంగరాజు, డాక్టర్ చైతన్య (న్యూరో సర్జన్), డాక్టర్ రాకేశ్ (జాయింట్ రిప్లేస్ముంట్ సర్జన్) పాల్గొన్నారు.