
చర్లపల్లి కార్పొరేటర్ బొంతు శ్రీదేవి
చర్లపల్లి, నవంబర్ 27 : చర్లపల్లి డివిజన్ పరిధిలో నెలకొన్న సమస్యలను దశలవారీగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని స్థానిక కార్పొరేటర్ బొంతు శ్రీదేవి అన్నారు. డివిజన్ పరిధిలోని వీఆర్ కాలనీలో గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు కాలనీలో చేపట్టిన ప్రధాన రహదారులతో పాటు అంతర్గత రహదారుల నిర్మాణ పనులను ఆమె.. ఏఈ సత్యలక్ష్మితో కలిసి శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. డివిజన్లో గుంతలమయంగా మారిన రహదారులకు మరమ్మతులు చేపట్టడంతో పాటు అవసరమైన ప్రాంతాల్లో రోడ్ల నిర్మా ణం చేపడుతున్నామన్నారు. అదేవిధంగా డివిజన్లో శిథిలావస్థకు చెరుకున్న డ్రైనేజీలను గుర్తించి నూతన డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం పుక్కట్నగర్లో ఉన్న అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. ఆమె మాట్లాడుతూ.. పిల్లలకు కావాల్సిన సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని, ముఖ్యంగా గర్భిణులకు పౌష్టికాహారం క్రమం తప్పకుండా అందించాలని నిర్వాహకులకు సూచించారు. అంగన్వాడీల పక్కా భవన నిర్మాణానికి చర్యలు తీసుకుంటామన్నారు.
కార్యక్రమంలో నాయకులు బొడిగె ప్రభుగౌడ్, బత్తుల శ్రీకాంత్‌యాదవ్, ముత్యాలు, సయ్యద్ అలీ, వెంకట్‌రెడ్డి, ప్రభుగౌడ్, శ్రీకాంత్‌యాదవ్, ధనుంజయ్యగౌడ్, సతీశ్‌గౌడ్, పొన్నం భాగ్యలక్ష్మి, అరుణ, గాలమ్మ, నాగమణి, సుజాత, కుమ్మరి పెంటమ్మ, బుచ్చమ్మ, మంగ, యాదమ్మ, ఎల్లయ్య పాల్గొన్నారు.