భారతీయ పురాణ ఇతిహాసం మహాభారతంలోని అంబ పాత్ర స్ఫూర్తితో ‘అంబ’S రివేంజ్’ పేరుతో ఓ చిత్రం రాబోతున్నది. కృత్రిమ మేధ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు. జయవర్ధన్ మడి దర్శకుడు. బుధవారం టైటిల్ పోస్టర్ను విడుదల చేశారు.
ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ‘తెలుగులో తొలిసారి రూపొందిస్తున్న పూర్తి ఏఐ ఆధారిత చిత్రమిది. విజువల్ డిజైన్, క్యారెక్టర్ క్రియేషన్ వంటి అంశాల్లో ఆధునిక ఏఐ సాధనాలను ఉపయోగించబోతున్నాం. తెలుగు సినీరంగంలో ఈ సినిమా ప్రయోగాత్మక అధ్యాయానికి నాంది పలికింది’ అన్నారు. ఈ చిత్రానికి నిర్మాతలు: యోగేంద్ర పొట్లూరి, రాణి మాడిసన్, ఏఐ విజువల్ డిజైన్ అండ్ డెవలప్మెంట్: కాలై విజువల్ స్టూడియోస్, దర్శకత్వం: జయవర్ధన్ మడి.