ఆలేరు టౌన్ : పట్టణంతోపాటు పలు గ్రామాల్లో క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. చర్చిల్లో క్రైస్తవులు భక్తిశ్రద్ధలతో ప్రార్థనలు చేశారు. కేక్ కట్ చేసి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ వస్పరి శంకరయ్య, టీపీసీసీ కార్యదర్శి జనగాం ఉపేందర్‌రెడ్డి, ప్రముఖ వైద్యుడు కె.ప్రభాకర్, కౌన్సిలర్లు బేతి రాములు, కందుల శ్రీకాంత్, రాయపురం నర్సింహులు, నాయకులు మోహన్‌రావు, మల్లేశం, నాగరాజు, ఫయాజ్, వినయ్, రవి, సంతోశ్, సాయిబాబా, పౌల్, మహేందర్‌రెడ్డి, పద్మ, రాంనర్సయ్య పాల్గొన్నారు.
మోటకొండూర్ : సికిందర్‌నగర్, చందేపల్లి గ్రామాల్లోని చర్చిల్లో ఉదయం నుంచే క్రిస్టియన్లు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుకొన్నారు. మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ఆవరణంలో ఎస్ఐ నాగరాజు కేక్ కట్ చేసి పలువురికి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు. మున్సిపాలిటీ కేంద్రంలోని సీఎస్ఐ చర్చిలో జరిగిన వేడుకల్లో ఇండియన్ రెడ్ క్రాస్ చైర్మన్ లక్ష్మీనర్సింహారెడ్డి కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో పాస్టర్ రత్నాకర్ తదితరులు పాల్గొన్నారు.
భువనగిరి అర్బన్ : పట్టణంతోపాటు మండలంలోని పలు చర్చిల్లో క్రిస్మస్ వేడుకలు జరుపుకొన్నారు. పట్టణంలోని ప్రగతినగర్ మన్న చర్చిలో నిర్వహించిన వేడుకల్లో మున్సిపల్ చైర్మన్ ఎన్నబోయిన ఆంజనేయులు పాల్గొని కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ చింతల కిష్టయ్య, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు ఏవీ కిరణ్‌కుమార్, ప్రధాన కార్యదర్శి రచ్చ శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు పోల ప్రవీన్గౌడ్, గుర్రాల శ్రీశైలం పాల్గొన్నారు. పట్టణంలోని పునీత జోజప్ప చర్చిలో పాస్టర్ శాంతిరెడ్డి ప్రత్యేక ప్రార్థనలు చేసి క్రిస్టియన్లను ఆశీర్వదించారు. కార్యక్రమంలో చర్చి కౌన్సిలర్ పిన్నింటి స్టాలిన్, స్లీవరాజు పాల్గొన్నారు.