
పాలమూరులో ఆధ్యాత్మికత పరిమళం
మహబూబ్‌నగర్, డిసెంబర్ 25 : మహబూబ్‌నగ ర్ పట్టణంలో ఆధ్యాత్మిక పరిమళం వెల్లివిరిసింది. శనివారం జిల్లా కేంద్రంలో అయ్యప్ప స్వాములు నిర్వహించిన శోభాయాత్ర ఆకట్టుకున్నది. తూర్పు కమాన్ నుంచి ప్రారంభమైన ఊరేగింపు క్లాక్‌టవర్, న్యూటౌన్ మీదుగా అయ్యప్ప కొండ వరకు స్వామి ఆభరణాల ఊరేగింపు కనులపండువగా సాగింది. కొండపై మహాపడిపూజ వైభవంగా జరిగింది. స్వాములు పెద్ద సంఖ్య లో హాజరై భక్తి పాటలు ఆలపిస్తూ తన్మయత్వానికి లో నయ్యారు. దీంతో పాలమూరులో ఆధ్యాత్మిక పరిమ ళం సంతరించుకున్నది. తిరుపతి వాస్తవ్యులు వెంకటేశ్వర శర్మ, పాలమూరు పట్టణ గురుస్వాముల ఆధ్వర్యంలో రాత్రికి ఏకశిల దివ్య పడునెట్టెంపడి పూజ, మ హామంగళ హారతి ఘనంగా నిర్వహించారు. అయ్యప్ప పాటలతో కొండ మార్మోగిపోయింది.
స్వాములకు అండగా ఉంటా.. : మంత్రి శ్రీనివాస్‌గౌడ్
ప్రతి ఏడాది అయ్యప్ప స్వాములు మొక్కవోని దీక్ష తో మాలాధారణ కొనసాగిస్తున్నారని క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. ఇది మం చి పరిణామమని చెప్పారు. శనివా రం పాలమూరులోని అయ్య ప్ప కొండపై నిర్వహించిన మహాపడిపూ జ, ఇతర పూ జలకు మంత్రి హాజరయ్యారు. గంగిరెద్దుకు మొక్కారు. కొండ పై రూ.25 లక్షలతో నిర్మించిన మల్టీపర్పస్ కమ్యూనిటీ హాల్‌ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మా ట్లాడుతూ ఆపదలో ఉన్న అయ్యప్ప స్వాములకు మే మున్నామంటూ రక్తదానం చేయడం అభినందనీయమన్నారు. అప్పన్నపల్లిలో కాశికపడి సంఘం ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన కల్యాణ మండపాన్ని ప్రారంభించారు. ప్రస్తుతం విస్తరిస్తున్న ప్రాంతాలను దృష్టిలో ఉంచుకొని ఏర్పాటు చేస్తున్న కల్యాణ మండపాలకు డిమాండ్ ఉన్నదని తెలిపారు. కార్యక్రమాల్లో మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, వైస్ చైర్మన్ తాటి గణేశ్, అయ్యప్ప స్వాములు ముత్యం, కౌన్సిలర్ కట్టా రవికిషన్‌రెడ్డి, పటేల్ ప్రవీణ్, నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, నటరాజ్, తిరుమల వెంకటేశ్, మున్సిపల్ కమిషనర్ ప్రదీప్‌కుమార్, నవకాంత్, అయ్యప్ప స్వాములు, కాశికపడి సంఘం నేతలు, టీఆర్ఎస్ నాయకులు, కాశిక పడి సంఘం సభ్యులు పాల్గొన్నారు.