క్రిస్మస్ కానుకలు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంపిణీలో కొడంగల్ ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డి
బొంరాస్‌పేట, డిసెంబర్ 20: రాష్ట్రంలోని అన్ని వర్గాల సంక్షేమానికి సీఎం కేసీఆర్ ప్రభుత్వం కృషి చేస్తున్నదని కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి అన్నారు. సోమవారం ఆయన మండల పరిషత్ కార్యాలయంలో 200 మంది క్రైస్తవ సోదరులకు ప్రభుత్వ కానుకలను అందించడంతోపాటు 39 మం ది మహిళలకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు, అదేవిధంగా పలువురు లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ నుంచి మం జూరైన చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం క్రిస్మస్ పండుగను క్రైస్తవ సోదరులు సంతోషంగా నిర్వహించుకోవాలనే ఉద్దేశంతో ప్రతి ఏడాదిలాగే ఈ సారి కూడా క్రిస్మస్ కానుకలను పంపిణీ చేస్తున్నదన్నారు. కొవిడ్ కారణంగా రాష్ట్ర ఆదాయం తగ్గినా సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని కొనియాడారు. ఇది పేదల ప్రభుత్వమని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ హేమీబాయి, వైస్ ఎంపీపీ నారాయణరెడ్డి, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు మహేందర్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ విష్ణువర్ధన్‌రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు కోట్ల యాదగిరి, మహేందర్, ఎంపీటీసీ శ్రవణ్‌గౌడ్, మండల సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు చాంద్‌పాషా, తహసీల్దార్ షాహెదాబేగం తదితరులు పాల్గొన్నారు.
హస్నాబాద్‌లో..
కొడంగల్ మండలంలోని హస్నాబాద్ గ్రామంలో సోమవారం కల్యాణలక్ష్మి, షాదీముబారక్, సీఎంఆర్ఎఫ్ నుంచి మంజూరైన చెక్కులను పలువురు లబ్ధిదారులకు పీఏసీఎస్ చైర్మన్ శివకుమార్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు దామోదర్‌రెడ్డి, నాయకులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు పకీరప్ప, సాయిలు, సావిత్రమ్మ తదితరులు పాల్గొన్నారు.