ఊరి కోడి కూరంటే ఆసక్తి చూపిస్తున్న ప్రజలు
ధర ఎక్కువైనా పెరుగుతున్న మాంసం విక్రయాలు
మిరుదొడ్డిలో నాటుకోళ్ల పౌల్ట్రీ ఫామ్
లాభాలను ఆర్జిస్తున్న యువకులు
కొండెక్కుతున్న బాయిలర్ చికెన్ ధరలు
అందోల్/మిరుదొడ్డి, నవంబర్ 20 : పండుగ.. పబ్బం.. శుభకార్యాలు.. విందులు.. వినోదాలు.. సందర్భమేదైనా ముక్క ఉండాల్సిందే.. అసలైన తెలంగాణ ైస్టెల్ కూడా నాటు కోడి కూరే.. కొవిడ్ నేపథ్యంలో బాయిలర్ చికెన్ కంటే నాటు కోడి మాంసం తింటే రోగ నిరోధక శక్తి పెరుగుతుందని వైద్యులు సూచించడంతో ఊరి కోడికి డిమాండ్ పెరిగింది. నాటు కోడి భలే టేస్ట్‌గా ఉండడంతో ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. చికెన్ ధరలు కూడా కొండెక్కుతుండడంతో దేశీ కోడికి ప్రాధాన్యమిస్తున్నారు. హోటళ్లు, రెస్టారెంట్లు, దాబాలు సైతం నాటుకోడి కూరను ప్రత్యేక వంటకంగా బోర్డులు పెట్టి మరీ భోజనప్రియులను ఆకర్షిస్తున్నాయి. రోజురోజుకూ డిమాండ్ పెరుగుతుండడంతో చాలా మంది రైతులు, ప్రజలు నాటుకోళ్ల వ్యాపారాన్ని ప్రారంభించారు. నాటుకోడి పౌల్ట్రీ ఫాంలు ఏర్పాటు చేసుకొని, లాభాలు ఆర్జిస్తున్నారు. దసరా, దీపావళి పండుగల నేపథ్యంలో చాలా మంది ముందే ఆర్డర్లు బుక్ చేసుకుని తీసుకెళ్లారు. రకాన్ని బట్టి ఒక్కో కోడి రూ.500 నుంచి రూ.వెయ్యి వరకు విక్రయిస్తున్నారు. అయితే, ధర ఎక్కువైనప్పటికీ కూర యమ టేస్టీగా ఉంటుందని ఇష్టంగా కొంటున్నారు.
పండుగ.. సంతోషం.. పుట్టినరోజు సందర్భం ఏదైనా ఇంట్లో ఏ దావత్ ఉన్నా ప్రజలు మాంసాహార భోజనానికి మొదటి ప్రాధాన్యమిస్తున్నారు. ముఖ్యంగా చికెన్ ముక్క లేనిదే కొంతమందికి ముద్ద దిగడం లేదు. దీంతో కొద్ది నెలలుగా చికెన్ ధరలు అమాంతం పెరిగిపోతూ సామాన్యులకు ముక్క చిక్కకుండా చేస్తున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో కేజీ చికెన్ ధర రూ. 240 నుంచి రూ. 260 వరకు ఉంది. అయితే, కొవిడ్ నేపథ్యంలో బాయిలర్ కోడి మాంసం కంటే నాటు కోడి మాంసానికి డిమాండ్ పెరిగింది. రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలని డాక్టర్లు సూచిస్తుండడంతో ప్రతి ఒక్కరూ నాటుకోడిపై ఆసక్తి చూపుతున్నారు. హోటళ్లు, రెస్టారెంట్లు, దాబాలు సైతం నాటుకోడి కూరను ప్రత్యేక వంటకంగా బోర్డులు పెట్టి మరీ భోజనప్రియులను ఆకర్షిస్తున్నాయి. రోజురోజుకూ డిమాండ్ పెరుగుతుండడంతో చాలా మంది రైతులు, ప్రజలు నాటుకోళ్ల వ్యాపారాన్ని ప్రారంభించారు.
జోరుగా విక్రయాలు
పట్టణాలతో పాటు పల్లెలో సైతం నాటుకోళ్ల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. అయి తే, డిమాండ్ అధికంగా ఉన్నప్పటికీ ఉత్పత్తి తగినంత లేకపోవడంతో పలువురు రైతులు ఈ వ్యాపారంపై దృష్టి పెట్టారు. ఇంటి పెరట్లో, పొలాల్లో కోళ్లను పెంచుతూ ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నారు. దసరా, దీపావళి పండుగల నేపథ్యంలో చాలా మంది ముందే ఆర్డర్లు బుక్ చేసుకుని తీసుకెళ్లారు. రకాన్ని బట్టి ఒక్కో కోడి రూ.500 నుంచి రూ.వెయ్యి వరకు విక్రయిస్తున్నారు. అయితే, ధర ఎక్కువైనప్పటికీ కూర యమ టేస్టీగా ఉంటుందని ప్రజలు అంటున్నారు.
వ్యవసాయం చేస్తూ కోళ్ల పెంపకం
వ్యవసాయ రంగంలో నాన్నకు తోడుగా ఉంటూ వ్యవసాయ పనులు చేస్తూనే ఏదో ఒకటి చేయాలనే తపనతో స్నేహితులతో కలిసి నాటు కోళ్ల పౌల్ట్రీ ఫామ్‌ను నిర్మించా. కోళ్లు మంచి గానే అమ్ముడు పోతున్నాయి. ఎవరి పైనా ఆధార పండకుండా వ్యాపారం చేయడం సంతోషంగా ఉంది. ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తా.
-మద్దెల చంద్రం, 7వ వార్డు సభ్యుడు, మిరుదొడ్డి
కోళ్లతో ఉపాధిని పొందుతున్నాం
గ్రామంలో సరైనా జీవనోపాధి లేకపోవడంతో నేను ఐదేండ్ల వరకు దుబాయికి వలస వెళ్లాను. కరోనా వైరస్ మూలంగా దుబాయి నుంచి స్వగ్రామానికి చేరుకొని నాటు కోళ్ల వ్యాపారం చేస్తున్నాను. నాణ్యమైన మాంసాహారం అందించాలనే లక్ష్యంతో నాటు కోళ్ల్లను పెంచి విక్రయిస్తున్నాను. ధరలు కూడా అందుబాటులో ఉండడంతో ప్రజలు ఎగబడి కొనుగోలు చేస్తున్నారు.
-గుడ్డొల్ల కనకరాజు, యువ రైతు, మిరుదొడ్డి