రామగిరి, డిసెంబర్ 10 : ఇన్స్పైర్ మానక్ అవార్డుల ప్రదర్శన 2020-21 విద్యాసంవత్సరానికి గాను నల్లగొండ జిల్లా నుంచి 20 ప్రదర్శనలు రాష్ట్రస్థాయికి ఎంపికయ్యాయి. విద్యార్థులో సృజనాత్మకతను వెలికితీసేందుకు నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్‌తో చేపట్టిన ఇన్స్పైర్ మానక్ అవార్డులకు జిల్లా నుంచి 196ప్రాజెక్టులు ఆన్లైన్లో నమోదయ్యాయి. వాటిని పరిశీలించిన న్యాయ నిర్ణేతలు 10శాతం ప్రాజెక్టులను ఎంపిక చేసినట్లు సమాచారం. పూర్తి వివరాలను శనివారం వెల్లడించే అవకాశం ఉన్నది. సూర్యాపేట నుంచి 88 ప్రాజెక్టులకు గాను 9, యాదాద్రి భువనగిరి జిల్లా నుంచి 89ప్రాజెక్టులకుగాను తొమ్మిదింటిని రాష్ట్రస్థాయికి ఎంపిక చేయడం తెలిసిందే.