
మర్రిగూడ, నవంబర్ 15 : మండల అభివృద్ధికి అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని ఎంపీపీ మెండు మోహన్‌రెడ్డి సూచించారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. విధి నిర్వహణలో అధికారులు అలసత్వం వీడాలన్నారు. పర్యవేక్షణ లోపం వల్లనే కింది స్థాయి అధికారులు, సిబ్బంది క్రమశిక్షణ తప్పారన్నారు. ముఖ్య అతిథిగా హాజరైన జడ్పీటీసీ పాశం సురేందర్‌రెడ్డి మాట్లాడుతూ పలు గ్రామ పంచాయతీల్లో అడ్డగోలుగా ఎంబీరికార్డు నమోదు చేస్తున్నారని సర్పంచ్ కుటుంబ సభ్యుల పేరు మీద నిధులు ఏవిధంగా విత్‌డ్రా చేస్తారని, నిలదీశారు. ఉపాధి హామీ పథకంలో చేపట్టిన ప్రతి పనికి వెంటనే సంబంధిత బోర్డులను నాటాలని సూచించారు. మాల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ దంటు జగదీశ్వర్ మాట్లాడుతూ రైతులు వరి ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసేలా అధికారులు, ప్రజాప్రతినిధులు అవగాహన కల్పించాలని సూచించారు. సమావేశంలో ఎంపీడీఓ రమేశ్ దీన్‌దయాళ్, ఏఓ స్పందన, ఎంపీఓ ఝాన్సీరెడ్డి, డిప్యూటీ తాసీల్దార్ తారకరామన్, వైద్యాధికారి రాజేశ్, ఏఈలు వెంకటేశ్వర్లు, పాషా, రాజేశ్, ఎంపీటీసీలు, సర్పంచులు పాల్గొన్నారు.
మార్కెట్ కమిటీ చైర్మన్‌కు సన్మానం
పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న మాల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ దంటు జగదీశ్వర్‌ను మండల ప్రజా పరిషత్ కార్యవర్గం, టీఆర్ఎస్ నాయకులు శాలువాలు బొకేలతో సన్మానించి స్వీట్లు తినిపించుకున్నారు.