పాల్గొన్న వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి
వనపర్తి టౌన్, నవంబర్ 15: వనపర్తి జిల్లా కేంద్రంలోని అయ్యప్పస్వామి ఆలయంలో సోమవారం కనుల పండువగా సహస్ర కలశాభిషేకం, ధ్వజస్తంభ ప్రతిష్ఠ మహోత్సవాలను ఆలయ నిర్వాహకులు ఘనంగా నిర్వహించారు. వేడుకలకు వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి హాజరై ధ్వజ స్తంభ ప్రతిష్ఠ, శివుడికి మహా భిషేకం నిర్వహించి పండితులచే ఆశీర్వాదం పొందారు. జిల్లాలోని అయ్యప్ప స్వాములు, అశేష భక్తజనం మధ్య వైభవోపేతంగా వేడుకలను నిర్వహించారు. మధ్యాహ్నం అయ్యప్ప స్వాములకు పడిపూజ నిర్వహించారు. వనపర్తి జిల్లా కేంద్రంలో సోమవారం మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డితో కలిసి సాయిట్రేడర్స్ను ప్రారంభించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు బాలీశ్వరయ్య, ప్రధాన కార్యదర్శి రఘువీరారెడ్డి, నగేష్, రమణ, శంకర్, ముత్తుకృష్ణ, నరేందర్, చీర్ల కృష్ణసాగర్, ఎల్బీ చారి, పాపిరెడ్డి, మున్సిపల్ చైర్మన్ గట్టుయాదవ్, వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్, కౌన్సిలర్ లక్ష్మీనారాయణ, కమిటీ సభ్యులు గోపినాథ్, అనిల్, వెంకన్న, నాగరాజు, చంద్రశేఖర్, పాండురంగ, వెంకటయ్య, రామకృష్ణ, శ్రీను, పురోహితుడు గోపాలశర్మ, అయ్యప్పస్వామి, ఆలయ ప్రధానాచార్యులు రమేశ్‌శర్మ పాల్గొన్నారు.