
చిట్యాల జనవరి 9 : మున్సిపాలిటీ పరిధిలోని శివనేనిగూడెంలో ఆదివారం ఓ మహిళ అనుమానాస్పదంగా మృతి చెందింది. గ్రామస్తులు తెలిపిన వివరాలివి.. సూర్యాపేట జిల్లా అర్వపల్లి మండలం కోమటిపల్లి గ్రామానికి చెందిన మోతె లింగమ్మ(25) భర్తతో విడిపోయి కొంతకాలంగా శివనేనిగూడెంలో కూలీ పనులు చేసుకుంటూ అక్కడే ఉంటుంది. అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తితో సహజీవనం చేస్తున్నది. శనివారం రాత్రి వారిద్దరూ మద్యం సేవించి నిద్రపోయారు. ఆదివారం ఉదయం చూసేసరికి లింగమ్మ మృతి చెంది ఉంది. మృతికి కారణాలు తెలియరాలేదు. లింగమ్మ సోదరుడు లింగస్వామి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ తెలిపారు.