ఆలేరు రూరల్, డిసెంబర్12 : ఆరోగ్య తెలంగాణే ప్రభుత్వ లక్ష్యమని టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గంగుల శ్రీనివాస్ అన్నారు. ఆదివారం మండలంలోని మంతపురి, మందనపల్లి గ్రామాలకు చెందిన గ్యాద యాదగిరికి రూ.60 వేలు, అయిల సుశీలకు రూ.40వేలు సీఎంఆర్ఎఫ్ నుంచి మంజూరైన చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ కోటగిరి పాండరి, ఉప సర్పంచ్ జంపాల సత్యనారాయణ, విద్యార్థి విభాగం మండలాధ్యక్షుడు మామిడాల భానుచందర్, గ్రామశాఖ అధ్యక్షుడు మహేందర్, నాయకులు రాములు, వెంకటేశ్ పాల్గొన్నారు.
మోటకొండూర్ : మండలంలోని కాటేపల్లి గ్రామానికి చెందిన పల్లపు అంజయ్యకు సీఎం సహాయ నిధి నుంచి రూ.60 వేల చెక్కు మంజూరైంది. ఈ చెక్కును సర్పంచ్ మంత్రి రాజు ఆదివారం లబ్ధిదారుడికి అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడాలేని విధంగా అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఏకైక సీఎం కేసీఆర్ అని పేర్కొన్నారు. టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు కానుగంటి కొమురయ్య, నాయకులు సోములు, వెంకటేశ్, మల్లేశ్, బాలమల్లేశ్ పాల్గొన్నారు.
బొమ్మలరామారం : మండలంలోని నాగినేనిపల్లి గ్రామనికి చెందిన రామిడి లక్ష్మమ్మకు రూ.60వేలు, గుజ్జ ఐలమ్మ కు రూ.22,500 సీఎం సహాయ నిధి నుంచి మంజూరైన చెక్కులను సర్పంచ్ బట్కీర్ బీరప్ప ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుపేదలకు సాయం అందిస్తున్న సీఎం కేసీఆర్కు, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో పీఏసీఎస్ డైరెక్టర్ కొండోజు ఆంజనేయులు, ఉపసర్పంచ్ రామిడి రాంరెడ్డి, వార్డు సభ్యులు మహేశ్, మహేందర్, టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు కట్టా సాయిరెడ్డి, నాయకులు గుజ్జ వెంకటేశ్, సంపత్, భాను, అనిల్, సుదర్శన్, నాగేశ్, ఎల్లయ్య, అంజిరెడ్డి పాల్గొన్నారు.