క్రికెట్ బెట్టింగ్‌లో నష్టపోవడంతో డబ్బు సంపాదనకు వక్రమార్గాన్ని ఎంచుకున్న యువకులు
ఉదయం తాళం వేసి ఉన్న ఇళ్ల గుర్తింపు.. రాత్రిళ్లు దొంగతనాలు
ఇద్దరు నిందితుల అరెస్టు.. రూ. 42 లక్షల విలువైన ఆభరణాలు స్వాధీనం
వివరాలు వెల్లడించిన సీపీ తరుణ్‌జోషి
హన్మకొండ సిటీ, ఆగస్టు 12 : ఈజీ మనీ కోసం క్రికెట్ బె ట్టింగ్‌లకు పాల్పడుతూ నష్టపోయిన ఇద్దరు యువకులు దొంగలుగా మారారు. అప్పు ఇచ్చిన వారు తిరిగి ఇవ్వాలని ఒత్తిడి చేయడంతో దొంగతనాలు చేయడం ప్రారంభించారు. చివరికి పోలీసులకు చిక్కి కటకటాలపాలయ్యారు. సీపీ తరుణ్‌జోషి గురువారం కమిషనరేట్‌లో వివరాలు వెల్లడించారు. మహబూబాబాద్ జిల్లా చిన్న ఎల్లాపూర్ గ్రామానికి చెందిన ఎనబోతుల సునీల్ (22) హనుమకొండ జూలైవాడలోని గణేశ్‌నగర్‌లో అమ్మమ్మ ఇంట్లో ఉంటూ డిగ్రీ పూర్తిచేశాడు. వందఫీట్ల రోడ్డులో మిత్రులతో కలిసి అద్దె ఇంట్లో ఉంటూ ఎమ్మెస్సీ కంప్యూటర్ సైన్స్ పూర్తి చేశాడు. తర్వాత ఈజీ మనీ కోసం క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడేవాడు. బెట్టింగ్‌ల ద్వారా పెద్ద మొత్తంలో డబ్బులు వస్తుండడంతో కురవి మండలం తట్టుపల్లి గ్రామానికి చెందిన లావుడ్యా సాగర్ (19) బ్యాంక్ ఖాతా ద్వారా లావాదేవీలు జరిపేవాడు. అత్యాశతో ఇతరుల వద్ద అప్పు చేసి మరీ బెట్టింగ్ చేసేవాడు. ఈక్రమంలో నిందితుడు నష్టపోయాడు. అప్పులు ఇచ్చిన వారూ డబ్బులు ఇవ్వాలని ఒత్తిడి పెంచారు. దీంతో అప్పులు చెల్లించడం కోసం దొంగతనాలు చేయాలని నిర్ణయించుకున్నాడు. యూట్యూబ్‌లో బీరువా, ఇంటి తాళాలు పగలగొట్టడం ఎలా అని పరిశీలించి.. అందుకు కావాల్సిన సాధనాలు కొనుగోలు చేశాడు. పగటిపూట ద్విచక్రవాహనంపై తాళాలు వేసి ఉన్న ఇళ్లను గుర్తించి రాత్రి చోరీలు చేసేవాడు.
కమిషనరేట్ పరిధిలో 15 చోరీలు..
నిందితుడు కమిషనరేట్ పరిధిలో మొత్తం 15చోరీలు చేశా డు. వాటిలో 13 సొంతంగా.. మరో రెండు సహ నిందితుడు సాగర్‌తో కలిసి చేశాడు. సుబేదారి పోలీస్‌స్టేషన్ పరిధిలో 7, హన్మకొండ, కేయూసీ పరిధిలో ఒక్కొక్కటి, మట్టెవాడ, ధర్మసాగర్, చిల్పూర్, కాజీపేట పీఎస్ పరిధిలో ఒక్కో చోరీ చే శారు. చోరీ చేసిన ఆభరణాలను సుబేదారిలోని ‘మణప్పురం’లో కుదవపెట్టేది. వరుస చోరీలపై ప్రత్యేక దృష్టి సారించి న సీసీఎస్, సుబేదారి పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి సీసీ కెమెరాలు, ఆధునిక టెక్నాలజీని వినియోగించి నిందితు ల కదలికలపై నిఘా పెట్టారు. చోరీ చేసిన సొత్తును కుదువ పెట్టి గోల్డ్‌లోన్ తీసుకునేందుకు సుబేదారికి వచ్చిన ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సుమారు రూ. 42 లక్షల విలువైన 825 గ్రాముల బంగారు ఆభరణాలు, 846 గ్రా ముల వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన సెంట్రల్ జోన్ డీసీపీ పుష్ప, సీసీఎస్ ఇన్స్పెక్టర్లు రమేశ్‌కుమార్, శ్రీనివాస్‌రావు, సుబేదారి ఇన్స్పెక్టర్ రాఘవేందర్, సీసీఎస్ ఎస్సై రాజేందర్, అసిస్టెంట్ అనాటికల్ ఆఫీసర్ సల్మాన్‌పాషా, ఏఎస్సై వీరస్వా మి, హెడ్‌కానిస్టేబుళ్లు ఇనాయత్ అలీ, జంపయ్య, కానిస్టేబుళ్లు వంశీ, సురేశ్, నజీరుద్దీన్‌ను సీపీ అభినందించారు.