
నూతనకల్, అక్టోబర్ 11 : మండలంలోని వెంకేపల్లి గ్రామానికి చెందిన వృద్ధ దంపతులు పిట్టల పాపయ్య, పిట్టల రామనర్సమ్మ దంపతులకు ఐరిస్ సమస్య, ఆధార్ కార్డులు లేక పింఛన్ రాక పోవడంతో వారి దయనీయ స్థితిని చూసిన తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ రూ.50 వేల ఆర్థిక సాయం అందించారు. సోమవారం వృద్ధ దంపతులను కలిసిన ఎమ్మెల్యే వారి స్థితి గతులను అడిగి తెలుసుకున్నారు. వారికి స్పెషల్ కేటగిరీ కింద దివ్యాంగ, వృద్ధాప్య పింఛన్లు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. వారిది పూరి గుడిసె కావడంతో ఇంటి నిర్మాణానికి అయ్యే ఖర్చులను తానే భర్తిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన దుర్గాదేవికి ప్రత్యేక పూజలు చేశారు. ఆయన వెంట జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, ఎంపీపీ భూరెడ్డి కళావతీసంజీవరెడ్డి, జడ్పీటీసీ కందాల దామోదర్‌రెడ్డి, తాసీల్దార్ జమీరుద్దీన్, ఎంపీడీఓ ఇందిర, పీఏసీఎస్ చైర్మన్ కనకటి వెంకన్న, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మున్న మల్లయ్య, సర్పంచ్ మాతంగి సోమనర్సమ్మ, ఎంపీటీసీ నరేశ్, కార్యదర్శి సాయిలుగౌడ్, నాయకులు లింగారెడ్డి, బుచ్చయ్యగౌడ్, వెంకటేశ్వర్లు, మహేశ్, విజయ్, సుధీర్‌రెడ్డి పాల్గొన్నారు.