అబ్దుల్లాపూర్‌మెట్, జనవరి 7 : తల్లిదండ్రులు తమ పిల్లలకు బాధ్యతగా కొవిడ్ టీకా వేయించాలని ఎంపీపీ బుర్ర రేఖమహేందర్‌గౌడ్ అన్నారు. అబ్దుల్లాపూర్‌మెట్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో శుక్రవారం ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ కేంద్రాన్ని ఆమె ముఖ్యఅతిథిగా హాజరై జడ్పీటీసీ బింగి దాస్‌గౌడ్, సర్పంచ్ చెరుకు కిరణ్‌కుమార్‌గౌడ్, ఎంపీటీసీ తాటిపల్లి సౌమ్యతో కలిసి ప్రారంభించి మాట్లాడారు. కార్యక్రమంలో హెచ్‌ఈవో గోపాల్, సూపర్వైజర్ నిర్మల, ఏఎన్ఎం బాలమణి, పాఠశాల ఉపాధ్యాయులు ఉన్నారు.
కవాడిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 15 నుంచి 18 సంవత్సరాలలోపు పిల్లల కోసం ఏర్పాటు చేసిన కొవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రాన్ని సర్పంచ్ దూసరి సుజాతయాదయ్యగౌడ్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఆమె వెంట పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సుజాత, ఉపాధ్యాయులు, ఏఎన్ఎం మంజుల, ఆశవర్కర్లు ఉన్నారు.
పాపిరెడ్డిగూడలో వ్యాక్సినేషన్
కేశంపేట, జనవరి 7 : మండలంలోని పాపిరెడ్డిగూడ ఉన్నత పాఠశాలలో 15 నుంచి 18 సంవత్సరాలలోపు 43 మంది విద్యార్థులకు కొవిడ్ టీకాలను వేసినట్లు వైద్య బృందం తెలిపింది. కార్యక్రమంలో సర్పంచ్ తాండ్ర విష్ణువర్దన్‌రెడ్డి, ఉపసర్పంచ్ సుందరయ్య, ప్రధానోపాధ్యాయులు వెంకటయ్యగౌడ్, పంచాయితీ కార్యదర్శి రాజశేఖర్‌రెడ్డి, ఏఎన్ఎం సంతోష, ఆశా కార్యకర్తలు సుజాత, సువర్ణ, మల్లమ్మ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
హిమాయత్‌నగర్‌లో వ్యాక్సినేషన్
మొయినాబాద్, జనవరి 7 : మండల పరిధిలోని హిమాయత్‌నగర్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని 15నుంచి 18 ఏండ్ల వయస్సు ఉన్న వారికి వ్యాక్సిన్ వేశారు. కార్యక్రమంలో సర్పంచ్ ఎం. మంజులరవియాదవ్, మండల విద్యాధికారి వెంకటయ్య, పాఠశాల ప్రిన్సిపాల్ మోహరి ఉన్నీసాబేగం, టి.పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు చెన్నయ్య, అంగన్వాడీ టీచర్లు లక్ష్మి, కవిత, ఏఎన్ఎం ఝాన్సీ ఉన్నారు.
మొగిలిగిద్ద గ్రామంలో..
షాద్‌నగర్‌టౌన్ జనవరి 7 : ఫరూఖ్‌నగర్ మండలం చించోడ్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని మొగిలిగిద్ద గ్రామం కేజీబీవీ కళాశాలలో నిర్వహించిన వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని శుక్రవారం ఎంపీడీవో శరత్‌బాబు, హెల్త్ ఎడ్యుకేటర్ శ్రీనివాస్ పరిశీలించి మాట్లాడారు. కళాశాలలో 120మంది విద్యార్థినులకు వ్యాక్సిన్ వేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ అరుణ, వైద్య సిబ్బంది మహేశ్వరి, పుష్ప పాల్గొన్నారు.
తట్టిఅన్నారంలో వ్యాక్సినేషన్
హయత్‌నగర్ రూరల్, జనవరి 7: పెద్దఅంబర్‌పేట మున్సిపాలిటీతోపాటు అబ్దుల్లాపూర్‌మెట్ మండలంలో 15 నుంచి 18 ఏండ్ల యువతకు కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరుగా సాగుతున్నది. శుక్రవారం మున్సిపాలిటీ 14వ వార్డు పరిధి ఇందుపల్లవి వద్ద ఉన్న నారాయణ కాలేజీలో వైద్య సిబ్బంది విద్యార్థులకు వ్యాక్సిన్ వేశారు. కార్యక్రమంలో కౌన్సిలర్ తొండాపు రోహిణి బ్రహ్మానందరెడ్డి, వైద్య సిబ్బంది శకుంతల, కళాశాల సిబ్బంది పాల్గొన్నారు.