
మద్దూరు, అక్టోబర్6: అన్నివర్గాల అభ్యున్నతే లక్ష్యంగా సీఎం కేసీఆర్ రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. బుధవారం సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం లద్నూర్ రిజర్వాయర్‌లో ఎంపీపీ బద్దిపడిగె కృష్ణారెడ్డి, చేర్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ సుంకరి మల్లేశంగౌడ్తో కలిసి ఆయన చేప పిల్లలను వదిలారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మత్స్యకారులకు జీవనోపాధిని కల్పించాలనే సదుద్దేశంతో ఏటా నీటి వనరుల్లో చేపపిల్లలను ప్రభుత్వం ఉచితంగా వదులుతున్నట్లు తెలిపారు. కాకతీయులు, రెడ్డిరాజుల కాలంలో నిర్మించిన చెరువు, కుంటలను సీఎం పునరుద్ధరించినట్లు తెలిపారు. దేవాదుల ప్రాజెక్టును 14 ఏండ్లు నిర్మించారని, కాళేశ్వరం ప్రాజెక్టు మాత్రం మూడేండ్లలో నిర్మించి మల్లన్నసాగర్, కొండపోచమ్మ, రంగనాయక్‌సాగర్ ప్రాజెక్టుల ద్వారా రైతులకు సాగు నీరందించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు రాష్ట్రంలో అమలువుతుంటే, రేవంత్‌రెడ్డి, బండి సంజయ్ పాదయాత్రల పేరిట విహారయాత్రలు చేస్తున్నారని విమర్శించారు. కేంద్ర నిధులు తీసుకరావడంలో వారిద్దరు విఫలమైనట్లు విమర్శించారు. హుజురాబాద్‌లో గులాబీ జెండా ఎగరడం ఖాయమన్నారు. అంతకు ముందు రిజజర్వాయర్ వద్ద ఎమ్మెల్యే మొక్కలు నాటారు. కార్యక్రమంలో మత్స్యశాఖ జిల్లా అధికారి మధుసూదన్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మేక సంతోశ్‌కుమార్, మంద యాదగిరి, వైస్‌ఎంపీపీ మలిపెద్ది సుమలతామల్లేశం, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షులు వంగ భాస్కర్‌రెడ్డి, చొప్పరి వరలక్ష్మిసాగర్, పీఏసీఎస్ వైస్ చైర్మన్ రాజిరెడ్డి, స్థానిక సర్పంచ్ జీడికంటి సుదర్శన్, ఎంపీటీసీ గుజ్జుక సమ్మయ్య, ఉపసర్పంచ్ బెడద కుమారస్వామి, నాయకులు బర్మ రాజమల్లయ్య, గూళ్ల ఆనందం, రాపాక బుచ్చిరెడ్డి, సూర్న ఐలయ్య, కాసర్ల కనకరాజు, టీఆర్ఎస్ నాయకులు, మత్స్యకార సొసైటీ సభ్యులు పాల్గొన్నారు.