
నేరేడ్మెట్, డిసెంబర్ 3: ఆరోగ్య తెలంగాణే ప్రభుత్వ లక్ష్యమని, రూపాయి ఖర్చు లేకుండా పేదలకు వైద్య సేవలు అందించడం అభినందనీయమని కార్పొరేటర్ కే.మీనా అన్నారు. శుక్రవారం యాప్రాల్‌లో బస్తీ దవాఖానను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బస్తీ దవాఖానలో 57 రకాల ఆరోగ్య పరీక్షలు, 150 రకాల మందులు ఉచితంగా అందించనున్నారని అన్నారు. సుస్తీలేని బస్తీలే లక్ష్యంగా పేదలకు ఇంటి ముంగిటే దవాఖాన ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో వైద్యులు జాన్‌బాబు, ప్రసన్న, ప్రత్యూష, నాయకులు ఉపేందర్‌రెడ్డి, కరంచంద్, మొటె సాయికుమార్, గోకుల్, శ్రీనివాస్‌రావు, రాంరెడ్డి, రమేశ్, మురళి, శ్రావణ్, చెన్నారెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, అవినాశ్, సాయి, నరేశ్, శోభ పాల్గొన్నారు.
గౌతంనగర్‌లో..
గౌతంనగర్, డిసెంబర్ 3: బస్తీ దవాఖానతో పేదలకు ఇంటి వైద్యం అందుతున్నదని కార్పొరేటర్ సునీతా యాదవ్ అన్నారు. శుక్రవారం ఓల్డ్ మిర్జాల్‌గూడలో బస్తీ దవాఖానను ప్రారంభించారు. కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ రాజు, డాక్టర్లు వెంకటేశ్, శిరీషా, నాయకులు రాముయాదవ్ పాల్గొన్నారు.