వలిగొండ, నవంబర్ 3 : ఆడబిడ్డలకు కల్యాణలక్ష్మి పథకం భరోసాగా నిలుస్తున్నదని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి అన్నారు. తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో బుధవారం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై లబ్ధిదారులకు 57కల్యాణలక్ష్మి, 1షాదీ ముబారక్ చెక్కులు అందించి మాట్లాడారు. నిరుపేదల కుటుంబాలకు ఆడబిడ్డల పెళ్లిళ్లు భారం కాకూడదని కల్యాణలక్ష్మి పథకం తెచ్చారని కొనియాడారు. సబ్బండ వర్గాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు. కల్యాణలక్ష్మి చెక్కులతో పాటు ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి పైళ్ల ఫౌండేషన్‌తో నూతన వధూవరులకు పోచంపల్లి పట్టుచీర, పట్టు పంచె, కండువా అందించారు. కార్యక్రమంలో ఎంపీపీ నూతి రమేశ్, జడ్పీటీసీ వాకిటి పద్మాఅనంతరెడ్డి, వలిగొండ ఏఎంసీ చైర్పర్సన్ కునపూరి కవిత, రైతుబంధు కన్వీనర్ పనుమటి మమతానరేందర్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ సుర్కంటి వెంకట్‌రెడ్డి, సర్పంచ్ బోళ్ల లలిత, ఎంపీటీసీ పల్సం రమేశ్, తహసీల్దార్ నాగలక్ష్మి, మత్స్యగిరి గుట్ట చైర్మన్ ముద్దసాని కిరణ్‌రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తుమ్మల వెంకట్‌రెడ్డి, మాజీ జడ్పీటీసీ మొగుళ్ల శ్రీనివాస్, డేగల పాండరి, మదర్ డెయిరీ డైరెక్టర్ గూడూరు శ్రీధర్‌రెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శులు మామిండ్ల రత్నయ్య, అయిటిపాముల రవీంద్ర, పట్టణాధ్యక్షుడు ఎమ్మె లింగస్వామి, యూత్ అధ్యక్షుడు పల్సం రాజు, వివిధ గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, నాయకులు పాల్గొన్నారు.
జర్నలిస్టు కుటుంబానికి ఆర్థిక సాయం
వలిగొండ : మండల కేంద్రానికి చెందిన జర్నలిస్టు శానగొండ గిరిబాబు కరోనాతో ఇటీవల మృతిచెందగా కుటుంబసభ్యులకు ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి రూ.2లక్షల చెక్కు అందించారు. ఆయన వెంట పార్టీ మండలాధ్యక్షుడు తుమ్మల వెంకట్‌రెడ్డి, ఏఎంసీ చైర్పర్సన్ కునపురి కవిత, రైతుబంధు సమితి మండల కన్వీనర్ పనుమటి మమతానరేందర్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ సుర్కంటి వెంకట్‌రెడ్డి, ఎంపీటీసీలు పల్సం రమేశ్, నోముల మల్లేశ్, మోటె నర్సింహ, నాయకులు రత్నయ్య, లింగస్వామి, రాజు పాల్గొన్నారు.
హాకీ టోర్నమెంట్ లోగో ఆవిష్కరణ
భువనగిరి అర్బన్ : జిల్లాకేంద్రంలోని న్యూ డైమెన్షన్ ఇంటర్నేషనల్ స్కూల్లో నవంబర్ 12నుంచి 14వరకు నిర్వహించే ఐదో రాష్ట్రస్థాయి అంతర్ జిల్లాల జూనియర్ పురుషుల హాకీ టోర్నమెంట్‌కి సంబంధించిన లోగోను ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి ఆవిష్కరించారు. కార్యక్రమంలో యాదాద్రిభువనగిరి జిల్లా సమాఖ్య అధ్యక్షుడు బయ్య కిరణ్‌కుమార్, రాఘవాపురం ఎంపీటీసీ గుంటిమీది ఆండాలుఅశోక్, టీఆర్ఎస్ నాయకులు దొంతిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, టీఆర్ఎస్వీ జిల్లా ప్రధాన కార్యదర్శి జక్కి నగేశ్, గ్రామ శాఖ అధ్యక్షుడు బుయ్య కిశోర్‌గౌడ్, జక్కి సంతోశ్, కుమార్, నారాయణ పాల్గొన్నారు.