కడ్తాల్, డిసెంబర్ 3 : పేదల సంక్షేమానికి ప్రభు త్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నదని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. మండలంలోని ముద్విన్ గ్రామానికి చెందిన శ్రీనివాస్‌రెడ్డికి రూ.72 వేలు, సాయికుమార్‌గౌడ్ రూ.35 వేలు, నర్సింహగౌడ్ రూ.18 వేలు, చరికొండ గ్రామానికి చెందిన ప్రమీలకు రూ.18 వేలు, సుకునమ్మ రూ.12 వేలు మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అందజేశారు.
ఎమ్మెల్సీకి సన్మానం
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికైన కసిరెడ్డి నారాయణరెడ్డిని శుక్రవారం టీఆర్ఎస్ నాయకులు సన్మానించారు. కేఎన్ఆర్ యువసేన జిల్లా అధ్యక్షుడు నరేశ్‌నాయక్ ఆధ్యర్యంలో టీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్సీకి పుష్పగుచ్ఛం అందజేసి శాలువాతో సన్మానించారు. ఎమ్మెల్సీని సన్మానించిన వారిలో రైతుబంధు సమితి కోఆర్డినేటర్ గోపాల్‌రెడ్డి, నాయకులు సురేందర్‌రెడ్డి, కొండల్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, లక్ష్మయ్యగౌడ్, భీష్మాచారి, బాల్‌రాజ్, లక్పతినాయక్, టీంకులాల్ నాయక్, జాన్యానాయక్, చిన్నాగౌడ్, వెంకటయ్య, అయిలయ్య, మోత్యానాయక్, జంగయ్య ఉన్నారు.
మాజీ ఎంపీపీ కుటుంబానికి ఎమ్మెల్సీ పరామర్శ
ఆమనగల్లు, డిసెంబర్ 3 : మాడ్గుల మండల కేంద్రంలో మాజీ ఎంపీపీ సూదుని రాంరెడ్డిని శుక్రవారం ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి పరామర్శించారు. రాంరెడ్డి మాతృమూర్తి రంగమ్మ ఇటీవల అనారోగ్యంతో మృతిచెందింది. విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ ఆయన నివాసానికి వెళ్లి ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
పేదలకు అండగా ముఖ్యమంత్రి సహాయనిధి
ఇబ్రహీంపట్నంరూరల్, డిసెంబర్ 3: సీఎం సహాయనిధి పథకం పేదలకు కొండంత అండగా నిలుస్తున్నదని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. మండలంలోని కప్పాడు గ్రామానికి చెందిన చాతాల చంద్రయ్య అనారోగ్యంతో ప్రైవేట్ దవాఖానలో చికిత్స చేయించుకున్నాడు. రూ.1.50 లక్షల ఖర్చు కాగా, సీఎం సహాయనిధికి దరఖాస్తు చేసుకున్నాడు. ప్రభుత్వం నుంచి రూ.60 వేలు మం జూరైన చెక్కును అందజేశారు. కార్యక్రమంలో ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు ఏనుగు భరత్‌రెడ్డి, ఉపసర్పంచ్ ఎండీ మునీర్, నాయకులు సతీశ్‌గౌడ్, శ్రీనివాస్‌రెడ్డి, టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు జలందర్గౌడ్ పాల్గొన్నారు.