
కౌడిపల్లి, నవంబర్ 3 : ఏడాది కాలంలో కౌడిపల్లి మండలానికి కాళేశ్వరం జలాలను తీసుకువచ్చి శాశ్వత పరిష్కారం చూపుతామని నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మదన్‌రెడ్డి అన్నారు. మండలంలోని మహ్మద్‌నగర్, తునికి గ్రామాల్లో రూ.66 లక్షలతో నిర్మించిన రైతు వేదికలను బుధవారం ప్రారంభించారు. ఆయా గిరిజన తండాల్లో రూ.3.70 కోట్లతో నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించారు. మహ్మద్‌నగర్ కొత్తరోడ్డు వద్ద పీఏసీఎస్ భవనం, గోదాం నిర్మాణానికి భూమిపూజ చేశా రు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశాల్లో ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ను లిసి కౌడిపల్లి ప్రాంతానికి కాళేశ్వరం నీళ్లు తీసుకురావడానికి కృషి చేస్తానన్నారు. మహ్మద్‌నగర్‌లో సర్పంచ్ దివ్యమహిపాల్‌రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని గ్రామాభివృద్ధిలో విశేష కృషి చేయడం అభినందనీయమని కొనియాడారు. మహ్మద్‌నగర్, కన్నా రం గ్రామాల్లో పూర్తిస్థాయిలో సీసీ రోడ్లు వేసేందుకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో రాష్ట్ర లేబర్ వెల్ఫేర్ బోర్డు చైర్మన్ ఉమ్మన్నగారి దేవేందర్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ చంద్రాగౌడ్, జిల్లా వ్యవసాయాధికారి పరశురాం నాయక్, డీసీసీబీ ఉమ్మడి మెదక్ జిల్లా డైరెక్టర్ బాన్సువాడ గోవర్ధన్‌రెడ్డి, ఆత్మకమిటీ చైర్మన్ మల్లారెడ్డి, ఎంపీపీ రాజు, జడ్పీటీసీ కవిత, మహ్మద్‌నగర్ సొసైటీ వైస్ చైర్మన్ చిలుముల చిన్న చిన్నంరెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సార రామాగౌడ్, టీఆర్ఎస్ మండల యూత్ అధ్యక్షుడు చంద్రం కృష్ణాగౌడ్, సర్పంచ్‌లు, ఎంపీటీసీ గుంజరి ప్రవీణ్‌కుమార్, నాయికోటి లింగం, స్వప్నకిశోర్, నాయకులు, తహసీల్దార్ రాణాప్రతాప్, ఎంపీడీవో భారతి, ఉద్యానవన శాఖ ఏడీఏ నర్సింహులు, అగ్రికల్చర్ ఏడీఏ బాబూనాయక్, ఏవో పద్మావతి, పీఆర్ ఏడీఏ అమరేశ్వర్, ఏఈ ప్రభాకర్ పాటు పాల్గొన్నారు.