ఆమనగల్లు, జనవరి 3: దేశ వ్యాప్తంగా రైతు వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం రైతుల ఉసురు తీస్తుందని జడ్పీచైర్‌పర్సన్ అనితారెడ్డి పేర్కొన్నారు. సోమవారం ఆమనగల్లు మండలంలోని రాంనుంతల, కోనాపుర్, ఆకుతోటపల్లి, శెట్టిపల్లి గ్రామాల్లో పలు అభివృద్ధి పనులను ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌తో కలిసి జడ్పీచైర్‌పర్సన్ ప్రారంభించారు. అనంతరం ఆకుతోటపల్లి గ్రామంలో రైతు వేదికభవన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. రైతుల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తున్నదన్నారు. రాంనుంతల పంచాయతీలో రైతువేదిక భవనం, వైకుంఠధామం, మహిళా సమైఖ్య, కోనాపుర్ గ్రామంలో వైకుంఠధామం, మహిళా సమైఖ్యభవనం, మట్టిరోడ్డు పనులు, రాంనుంతల గ్రామంలో రూ.1.34 కోటి లక్షల అభివృద్ధి పనులకు నిధులు మంజూరయ్యాయన్నారు.
కల్వకుర్తి నియోజకవర్గం అభివృద్ధికి కృషి
కల్వకుర్తి నియోజకవర్గ అభివృద్ధికి కృషిచేస్తానని ఎమ్మెల్యే తెలిపారు. ప్రభుత్వంపై ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న ఆరోపణలు అవాస్తవమన్నారు. అంతకుముందు ఆకుతోటపల్లిలో వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించి, విద్యార్థులకు డిక్షనరీలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ అనితా, వైస్ ఎంపీపీ అనంతరెడ్డి, ఏఎంసీ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి, వైస్‌చైర్మన్ తోటగిరియాదవ్, సింగిల్‌విండో చైర్మన్ గంప వెంకటేశ్, మండల రైతుబంధు సమితి అధ్యక్షుడు నిట్టనారాయణ, ఎంపీటీసీ మంగమ్మ, సరితా, సర్పంచ్‌లు సోనా, మల్లమ్మ, రజిత, గోధాదేవి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు అర్జున్‌రావు, ఎంపీడీవో వెంకట్రాములు, ఏడీఏ సుజాత, డీఈ తిరుపతిరెడ్డి, ఏఈ కృష్ణయ్య, నాయకులు విక్రమ్చారి సతీశ్, శ్రీనివాస్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, ఖలీల్, పంతూనాయక్, లక్ష్మణ్‌నాయక్, రవి, సంజీవ్ పాల్గొన్నారు.