
డీఎస్పీ వెంకటేశ్వర్‌రెడ్డి
నల్లగొండ రూరల్, నవంబర్ 30 : ఆపదలో ఉన్న వారికి రక్తదానం చేయడం హర్షణీయమని నల్లగొండ డీఎస్పీ వెంకటేశ్వర్‌రెడ్డి అన్నారు. ఆర్టీసీ, ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో నల్లగొండ బస్టాండ్‌లో మంగళవారం నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఆర్టీసీ రీజినల్ మేనేజర్ కె.రాఘవేంద్రప్రసాద్ మాట్లాడుతూ రక్తదానం చేయడం వల్ల ఆరోగ్యంగా ఉండొచ్చన్నారు. అనంతరం ఎన్జీ కళాశాల, రామన్నపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలకు చెందిన ఎన్సీసీ క్యాడెట్స్, విద్యార్థులు, ఆర్టీసీ ఉద్యోగులు 130 మంది రక్తదానం చేశారు. కార్యక్రమంలో రెడ్‌క్రాస్ చైర్మన్ గోలి అమరేందర్‌రెడ్డి, డీవీఎం శ్యామల, డీఎంలు రామచంద్రమూర్తి, కృపాకర్‌రెడ్డి పాల్గొన్నారు.
మిర్యాలగూడ డిపోలో..
మిర్యాలగూడ టౌన్/దేవరకొండ : మిర్యాలగూడ బస్టాండ్‌లో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని డిపో మేనేజర్ బొల్లెద్దు పాల్ ప్రారంభించారు. సామాజికవేత్త డాక్టర్ రాజు, రెడ్‌క్రాస్ అధ్యక్షుడు గార్లపాటి వెంకటేశ్వర్లు, ఆర్టీసీ సీఐ సంధ్యారాణి, వెంకటేశ్, నాగేశ్వర్రావు, జానకిరెడ్డి, రామావతారం పాల్గొన్నారు. దేవరకొండ డిపోలో 44 మంది రక్తదానం చేశారని డిపో మేనేజర్ రాజీవ్ ప్రేమ్‌కుమార్ తెలిపారు
నాట్కో ఫార్మలో రక్తదాన శిబిరం
నందికొండ : నాట్కో ఫార్మలో మంగళవారం రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. మేనేజర్ వీర నారాయణ మాట్లాడుతూ నాట్కోఫార్మ వ్యవస్థాకుడు నన్నపునేని వెంకయ్యచౌదరి జన్మదినం సందర్భంగా 150 మంది ఉద్యోగులు రక్తదానం చేసినట్లు తెలిపారు. రంజిత్, జీఎల్ఎన్ రావు, సువర్ణకుమారి పాల్గొన్నారు.