
మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు
మిర్యాలగూడ, నవంబర్ 10 : కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను డిమాండ్ చేశారు. మంగళవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులు ప్రతిపక్షాల మాటలు నమ్మి మోసపోవద్దని సూచించారు. కిషన్‌రెడ్డి, బండి సంజయ్ ఏనాడైనా రైతుల పొలాల్లో అడుగుపెట్టారా అని ప్రశ్నించారు. గత యాసంగిలో ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని భరోసా ఇచ్చిన ఎఫ్‌సీఐ నేటి వరకూ మిల్లుల నుంచి ధాన్యాన్ని కొనలేదని పేర్కొన్నారు. కిషన్‌రెడ్డి, బండి సంజయ్ కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి మిల్లర్ల నుంచి ధాన్యాన్ని తీసుకుంటే రెండో పంట కొనటానికి ఇబ్బందులు ఉండవన్నారు. నియోజకవర్గంలోని రైతులు ఆందోళన చెందకుండా రెండో పంటగా సన్నఒడ్లు వేయండి, మంచి రేటుతో అమ్మిచ్చే బాధ్యత తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఈ విషయమై రైస్‌మిల్లర్లతో సమావేశం నిర్వహించి వారికి తెలియజేశామన్నారు. సమావేశంలో ఏఎంసీ మాజీ అధ్యక్షుడు చింతరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు వీరకోటిరెడ్డి, నాయకులు దుర్గంపూడి నారాయణరెడ్డి, మోసిన్ఆలీ, హతీరాం, బాలాజీనాయక్, నామిరెడ్డి కరుణాకర్‌రెడ్డి, పాలుట్ల బాబయ్య, రామారావు పాల్గొన్నారు.