
భువనగిరి అర్బన్, ఆగస్టు 6: తెలంగాణ ఉద్యమానికి బాసటగా నిలిచిన ఆచార్య కొత్తపల్లి జయశంకర్‌ను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ కార్యాలయంలో జయంతి సందర్భంగా జయశంకర్సర్ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. తెలంగాణ భావజాలాన్ని విస్తృత పరిచిన వ్యక్తిగా ఆచార్య జయశంకర్ సేవలను కలెక్టర్ గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ దీపక్‌తివారీ, ఇన్చార్జి అదనపు కలెక్టర్ భూపాల్‌రెడ్డి, జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. భువనగిరి వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో జయశంకర్ సర్ జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సమావేశంలో జిల్లా మార్కెటింగ్ అదికారి ఏ.సబిత, మార్కెట్ కార్యదర్శి డి.అంజిత్‌రావు, నాయకులు సిద్ధుల పద్మ, సువర్ణ, సూపర్వైజర్ రాజీవ్‌కుమార్, సిబ్బంది రాజు, శ్రీను, ప్రవీణ్, ఆయూబ్, తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ ఎన్నబోయిన ఆంజనేయులు జయశంకర్సర్ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ చింతల కిష్టయ్య, కమిషనర్ ఎం.పూర్ణచందర్, నాయకులు బాషబోయిన రాజేశో తదితరులు పాల్గొన్నారు.
మోత్కూరు మున్సిపల్ కార్యాలయంలో..
మోత్కూరు, ఆగస్టు6 : తెలంగాణ రాష్ట్ర పితామహుడు, ప్రొఫెసర్ దివంగత జయశంకర్ సార్ ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకొని పని చేయాలని మోత్కూరు మున్సిపల్ చైర్ పర్సన్ తీపిరెడ్డి సావిత్రీమేఘారెడ్డి అన్నారు. జయశంకర్ సార్ జయంతి సందర్భంగా మోత్కూరు మున్సిపాలిటీ కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో టీఆర్ఎస్ మండల కమిటీ ఆధ్వర్యంలో జయంతిని నిర్వహించారు. ఆయన చిత్ర పటానికి పూల మాల వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలోటీఆర్‌ఎస్ మండలాధ్యక్షుడు పొన్నేబోయిన రమేశ్, వ్యవసాయ మార్కెట్ మాజీ చైర్మన్మేఘారెడ్డి, మాజీ వైస్ చైర్మన్ కొణతం యాకుబ్‌రెడ్డి, రైతు బంధు మండలా ధ్యక్షుడు కొండ సోంమల్లు, మోత్కూరు మున్సిపాలిటీ వైస్ చైర్మన్ బి వెంకటయ్య, మండల కార్యదర్శి గజ్జి మల్లేశ్, మాజీ ఎంపీటీసీ జంగ శ్రీను,విష్ణుమూర్తిగౌడ్, మున్సిపల్ కౌన్సిలర్లు బి కళ్యాణ్ చక్రవర్తి, పురుగుల వెంకన్న, గనగాని నర్సింహ్మ, రజిత, టీఆర్ఎస్ మండల మహిళా విభాగం అధ్యక్షురాలు మల్లం అనిత పాల్గొన్నారు.
దిశానిర్దేశకుడు జయశంకర్..
యాదాద్రి, ఆగస్టు 6: తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్ 87వ జయంతిని శుక్రవారం ఆలేరు నియోజకవర్గ వ్యాప్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ప్రజాప్రతినిధులు, నాయకులు ఆయనకు ఘనంగా నివా ళులర్పించారు. రాష్ట్ర సాధనలో ముందుండి దిశానిర్దేశం చేసిన మహనీయుడు ప్రొఫెసర్ జయశంకర్ సార్ అని పలువురు అభిప్రాయపడ్డారు. ఆయన అడుగుజాడల్లోనే సీఎం కేసీఆర్ నడుస్తున్నారని చెప్పారు. సర్ సేవలను స్మరిస్తూ వాడవాడనా సంబురాలు జరుపుకున్నారు.
రామన్నపేటలో..
రామన్నపేట, ఆగస్ట్06: మండలకేంద్రంలోని సీడీపీవో కార్యాలయంలో ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భం గా శుక్రవారం జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ అధికారి కృష్ణవేణి ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈకార్యక్రమంలో సీడీపీవో శైలజ, బ్లాక్ కోఆర్డినేటర్ అశోక్, సుజాత, చందులాల్, శోభ పాల్గొన్నారు.