
దుబ్బాక/ మిరుదొడ్డి/దౌల్తాబాద్, ఆగస్టు 7 : బిడ్డకు తల్లిపాలే శ్రేష్టమని మున్సిపల్ చైర్పర్సన్ గన్నె వనితారెడ్డి అన్నారు. శనివారం అంగన్వాడీ కేంద్రాల్లో తల్లిపాల వారోత్సవాలు నిర్వహించి, బాలింతలు, గర్భిణు లకు పౌష్టికాహారం అందజేశారు. తల్లిపాల విశిష్టత వివరించారు. శిశువుకు పాలు ఇవ్వడంతో రొమ్ము క్యాన్సర్ ముప్పు ఉండదన్నారు. కార్యక్రమాలలో కౌన్సిలర్లు సులోచన, లలిత, దేవలక్ష్మి, రాజవ్వ, అంగన్వాడీ టీచర్లు దీనా, బండ విజయ ఉన్నారు.
మిరుదొడ్డి మండలం కాసులాబాద్లో సర్పంచ్ బాల్‌రాజు పౌష్టికాహారాన్ని అందజేశారు. కార్యక్రమంలో ఎంపీటీసీ కీసరి రాజవ్వ, ఉప సర్పంచ్ అలాం, పీఏసీఎస్ డైరెక్టర్ రవి, అంగన్ వాడీ టీచర్లు, వార్డు సభ్యులు పాల్గొన్నారు. దౌల్తాబాద్ మండలం గాజులపల్లి, సూరంపల్లి గ్రామాల్లో పీహెచ్సీ ల్యాబ్ టెక్నీషియన్ రాజు నిర్వహిం చిన కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు సరోజన, బాలవ్వ, రజిని, కుమారి, నాగరాణి, రజిత, రేణుక, కనకలక్ష్మి ఉన్నారు.
హుస్నాబాద్ టౌన్/కోహెడ/అక్కన్నపేట/కొండపాక, ఆగస్టు 7 : మత్స్యకారుల సంఘంలో జరిగిన కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ రజితావెంకన్న మాట్లాడుతూ తల్లిపాలతోనే పిల్లల్లో రోగనిరోధకశక్తి పెరుగుతుందన్నారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్వైజర్ రేణుక, కౌన్సిలర్లు గూళ్ల రాజు, బొల్లి కల్పన, అంగన్వాడికార్యకర్త జాల రాజేశ్వరి, హెల్త్ సూపర్వైజర్ ఉన్నారు. కోహెడలో సర్పంచ్ పేర్యాల నవ్య ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో సీడీపీవో జయ శ్రీ, ఎంపీటీసీ స్వరూప, సూపర్వైజర్ రమణకుమారి, ఏఎన్ఎం మంజుల, అశ్విని, అంగన్వాడీ వర్కర్లు విజయ, కృష్ణకుమారి, తిరుమల, రాజేశ్వరి పాల్గొన్నారు. అక్కన్నపేట మండలం పంతుల్‌తండాలో ఐసీడీఎస్ సూపర్వైజర్ పాషాబేగం, సర్పంచ్ ఆశ్వినీకుమారి, అంగన్వాడీ టీచర్లు జ్యోతి, బుచ్చమ్మ, రాజేశ్వరి పాల్గొన్నారు. కొండపాక మండలం కోనాయిపల్లిలో అంగన్వాడీ టీచర్ జగదీశ్వరి, ఆశ వర్కర్ కవిత, అంగన్వాడీ టీచర్ రాజ్యలక్ష్మి పాల్గొన్నారు.
చేర్యాల, ఆగస్టు 4 : తల్లిపాలతో శిశువు సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని మున్సిపల్ చైర్పర్సన్ అంకుగారి స్వరూపరాణి, కౌన్సిలర్ సతీష్‌గౌడ్ అన్నారు. పట్టణంలోని అంగన్వాడీ కేంద్రాల్లో మహిళలకు పౌష్టికాహారాన్ని పంపిణీ చేశారు.