
సుభిక్షంగా ఉన్న రాష్ర్టాన్ని చూసి ఓర్వలేక యాత్రలు
బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై నిప్పులు చెరిగిన వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
విపక్షాలను ప్రజలే బొందపెడ్తారని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. మండల కేంద్రంలో శనివారం మోత్కూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా నియమితులైన కొణతం యాకుబ్‌రెడ్డి, పాలకవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సుభిక్షంగా ఉన్న తెలంగాణను చూసి ఓర్వలేకనే కాంగ్రెస్, బీజేపీ నేతలు యాత్రలు చేస్తున్నారని మండిపడ్డారు. విపక్షాల పట్ల అప్రమత్తంగా ఉండకపోతే ప్రజలు మళ్లీ అవస్థలు పడక తప్పదన్నారు. కేంద్రం పెట్రోల్, గ్యాస్ ధరలను పెంచడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతుంటే బీజేపీ రాష్ట్ర అధ్యక్షు డు బండి సంజయ్ ఏ ముఖం పెట్టుకుని యాత్ర చేస్తున్నాడని దుయ్యబట్టారు.
మోత్కూరు, ఆగస్టు28: సంక్షేమం, అభివృద్ధితో సస్యశ్యామలమైన రాష్ట్రంలో అలజడులు సృష్టించేందుకు కొన్ని పార్టీలు యాత్రల పేరుతో బయ లు దేరాయని వాటిపై అప్రమత్తంగా ఉండాలని, ప్రజలే ఆ పార్టీలను బొంద పెడ్తారని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. శనివారం మోత్కూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా నియమితులైన కొణతం యాకుబ్‌రెడ్డి, పాలకవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవం పట్టణంలోని ఎల్ఎన్ ఫంక్షన్ హాల్లో జరిగింది. ఈ కార్యక్రమానికి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. సుభిక్షంగా ఉన్న రా ష్ర్టాన్ని చూసి ఓర్వలేకచేస్తున్న యాత్రలను ప్రజలు పట్టించుకోరని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై ఆయన నిప్పులు చెరిగారు. సిగ్గు, శరం లేని తెలంగాణ ద్రోహి చంద్రబాబు తెలంగాణలో ప్రజలకు ము ఖం చూపలేక ఆయన తొత్తు రేవంత్‌రెడ్డిని ఇక్కడ పెట్టి రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. అభివృద్ధి నిరోధకులైన బీజేపీ, కాంగ్రెస్ పార్టీలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పెట్రోల్, గ్యాస్ ధరలను పెంచి కేంద్ర ప్రభుత్వం ప్రజల నడ్డివిరుస్తున్నదని, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఏ ముఖం పెట్టుకుని యాత్రలు చేస్తున్నాడని దుయ్యబట్టారు. సంగ్రామం ఎవరి మీదో చెప్పాలని డిమాండ్ చేశారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, గిరిజన యూనివర్సిటీ, విభజన చట్టంలోని అంశాలను నెరవేర్చేలా కేంద్రంపై సంగ్రామం చేయాలని బండి సంజయ్‌కు నిరంజన్‌రెడ్డి సూచించారు. సీఎం కేసీఆర్ సారథ్యంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధిపథంలో దూసుకెళ్తున్నదని కొనియాడారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాలు మార్కెట్ వ్యవస్థకు విరుద్ధంగా ఉండడంతో సుప్రీంకోర్టు ఆక్షేపించిందని అన్నారు. రాష్ట్రంలో పాత వ్యవసాయ విధానంలోనే పంట ఉత్పత్తులను కొనేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నట్లు తెలిపారు. రైతులు సన్న రకం ధాన్యంతోపాటు ఆరుతడి పం టల సాగును చేపట్టి లాభాలను పొందాలన్నారు. రాష్ట్రంలో 35లక్షల కరెంట్ మోటారు పంపు సె ట్లు ఉన్నాయని, ఉచిత విద్యుత్, రైతుబంధు పేరిట ప్రతిఏటా రూ.60 వేల కోట్ల భారం ప్రభుత్వంపై పడుతున్నదని ఆయన చెప్పారు.
రైతును లక్షాధికారిని చేయడమే..
రాష్ట్రంలో ప్రతి రైతును లక్షాధికారిని చేయడమే సీఎం కేసీఆర్ ప్రభుత్వ లక్ష్యమని విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. శనివారం ఆయన మార్కెట్ కమిటీ పాలకవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార సభకు హాజరై మాట్లాడారు. అభివృద్ధిలో రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందన్నారు. ఉమ్మడి ప్రభుత్వాల పాలనలో విధ్వంసానికి గురైన వ్యవసాయ రంగానికి పూర్వ వైభవం తీసుకొచ్చి తెలంగాణను దేశ భాండాగారంగా నిలిపిన మహానుభావుడు సీఎం కేసీఆర్ అని ఆయన కొనియాడారు. తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ అధ్యక్షతన జరిగిన రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్, డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్‌రెడ్డి, రాష్ట్ర ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి, కలెక్టర్ పమేలాసత్పతి, అదనపు కలెక్టర్ దీపక్‌తివారీ, అల్డా చైర్మన్ మోతే పిచ్చిరెడ్డి, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు కొల్పుల అమరేందర్, ఎస్ఐ రజాక్, జడ్పీటీసీలు గోరుపల్లి శారదాసంతోష్‌రెడ్డి, జ్యోతి, మున్సిపల్ చైర్పర్సన్ తీపిరెడ్డి సావిత్రీమేఘారెడ్డి, అడ్డగూడూరు ఎంపీపీ అంజయ్య, డీఏవో అనురాధ, రైతు సహకార సంఘం చైర్మన్ కంచర్ల అశోక్‌రెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పొన్నేబోయి న రమేశ్, మార్కెటింగ్ అధికారులు పాల్గొన్నారు.
సభ్యుల ప్రమాణ స్వీకారం
నూతన మార్కెట్ కమిటీ చైర్మన్‌గా కొణతం యాకుబ్‌రెడ్డి, వైస్ చైర్మన్‌గా మూగల శ్రీనివాస్, డైరెక్టర్లుగా వంగరి మల్లయ్య, గడ్డం దశరథ, సోలిపురం లక్ష్మారెడ్డి, కొంగరి ఎల్లయ్య, కంచర్ల చలపతిరెడ్డి, పబ్బు జయమ్మ, సోమనర్సయ్య, సోమ వెంకటేశ్వర్లు, తీపిరెడ్డి సావిత్రి, కంచర్ల అశోక్‌రెడ్డి ప్రమాణస్వీకారం చేశారు. అంతకుముందు మో త్కూరు, గుండాల, ఆత్మకూరు(ఎం), అడ్డగూడూరు మండలాలకు చెందిన పార్టీ శ్రేణులు వైజే ఫంక్షన్‌హాల్ నుంచి సభావేదిక వద్దకు బైక్ ర్యాలీని నిర్వహించారు.