
నీలగిరి, ఆగస్టు27: నల్గొండ జిల్లాలో వ్యవసాయమే ఆధారంగా జీవిస్తున్న రైతుబిడ్డల ఉన్నత విద్యాభ్యాసానికి విద్యారుణాలను సహకార బ్యాంకు ద్వారా అందించనున్నట్లు జిల్లా కేంద్ర సహకా ర బ్యాంకు చైర్మన్ గొంగిడి మహేందర్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన జిల్లా కేంద్ర సహకార బ్యాంకు మహాజనసభ సందర్భం గా సమావేశం నిర్వహించి, సీఎం కేసీఆర్‌పై గౌరీశంకర్ రూపొం దించిన ఒక్కగానొక్కడు అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు.
అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వ్యవసాయమే ఆధారంగా జీవిస్తున్న రైతులను అన్ని విధాలా ఆదుకునేందుకు సహకార బ్యాంకు ముందుకొచ్చిం దన్నారు. ఈ ఏడాది నుంచి రైతుబిడ్డలకు విద్యారుణాలతోపాటు రైతులకు గృహ నిర్మాణ రుణాలను కూడా అతి తక్కువ వడ్డీకి అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ విద్యా సంవత్సరం సుమా రు 200 మంది రైతు కుటుంబాల్లోని విద్యార్థుల ఉన్నత చదు వులు, విదేశాల్లో చదివేందుకు రూ.35 కోట్లను మంజూరు చేసిన ట్లు చెప్పారు. అంతేగాకుండా దీర్ఘకాలిక రుణాల కోసం వ్యవసా య భూముల్లో ఎకరం మెట్టకు రూ.1.5లక్షలు, తరికి రూ. 2లక్షల వరకు మార్టిగేజ్ రుణాలు ఇచ్చారని, కానీ సహకార బ్యాం కు ద్వారా వాటిని పెరుగుతున్న ధరలకు అనుగుణంగా పెంచినట్లు ఆయన తెలిపారు. మెట్ట భూములకు రూ.4లక్షలు, తరి భూము లకు రూ.5లక్షలను ఎకరాకు అందించనున్నట్లు తెలిపారు. దీని వల్ల ఎక్కువ మొత్తంలో రైతులు రుణాలు పొందేందుకు వీలు కలుగుతుందన్నారు. వీటితోపాటు ఆర్థిక సంవత్సర బడ్జెట్‌ను ప్రవేశపెట్టామని, అందులో రూ.11 కోట్ల లాభాలు రాగా, అన్ని రకాల పన్నులు పోను రూ.6.58 కోట్లు నికర ఆదాయం వచ్చిం దని, బ్యాంకు 103 ఏండ్ల చరిత్రలో ఇంత ఆదాయం రావడం ఇదే ప్రథమమని గొంగిడి మహేందర్‌రెడ్డి సంతోషం వ్యక్తం చేశా రు. సహకార సంఘాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల వయోపరిమితిని 61 ఏండ్లకు పెంచుతూ తీర్మానం చేసినట్లు తెలిపారు. సమావేశం లో బ్యాంకు వైస్‌చైర్మన్ ఏసీరెడ్డి దయాకర్‌రెడ్డి, డైరెక్టర్లు, సొసైటీ చైర్మన్లు రంగాచారి, అప్పిరెడ్డి, సైదయ్య, రామారావు, సైదులు, శ్రీనివాస్‌రెడ్డి, రామ్‌రెడ్డి, మల్లేశ్, రమణారెడ్డి ఉన్నారు.