
ఉదయసముద్రం ప్రాజెక్టు పనులు ఏడు మాసాల్లో పూర్తి
రైతులకు సాగునీరందించడమే ప్రభుత్వ లక్ష్యం
లిఫ్ట్ ఏర్పాటుకు రూ.100 కోట్లు మంజూరు చేసిన సీఎం కేసీఆర్
అయిటిపాముల రిజర్వాయర్ నుంచి నీటిని విడుదల చేసిన ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
కట్టంగూర్, ఆగస్టు 27: దేశానికి అన్నం పెట్టే రాష్ట్రంగా తెలంగాణ అభివృద్ధి చెందినదని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. శుక్రవారం ఆయన మండలంలోని అయిటిపాము ల రిజర్వాయర్ నుంచి కింది ప్రాంతాలైన నకిరేకల్, కేతేపల్లి మండలాల్లోని చెరువులను నింపేందుకు నీటిని విడుదల చేశా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నకిరేకల్, కేతేపల్లి, కట్టంగూర్ మండలాల్లోని పంట పొలాలకు నీరందించేందుకు రిజర్వాయర్ నుంచి 300 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నామన్నారు. ఏడేండ్ల టీఆర్ఎస్ పాలనలో కాళేశ్వరం ప్రాజెక్టును కేవలం నాలుగేండ్లలోనే పూర్తి చేసి లక్షలాది ఎకరాలకు సాగు నీరందించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని కొనియాడారు. వ్యవసాయ రంగానికి నీరందించేందుకు అయిటిపాములలో లిఫ్ట్ ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్‌ను కోరిన ఐదు నెలల్లో రూ.100 కోట్ల నిధులు మంజూ రు చేసినట్లు ఆయన చెప్పారు. లిఫ్టు ఏర్పాటు సర్వే పనులు ప్రారంభమైనట్లు వారం రోజుల్లో టెండర్ ప్రక్రియను పూర్తి చేసి వచ్చే ఏడాదిలో పనులను పూర్తి చేసి 10 వేల ఎకరాలకు సాగు నీరు అందిస్తామన్నారు. ప్రభుత్వం పెండింగ్ బిల్లులు చెల్లించటంతో ఉదయసముద్రం ప్రాజెక్టు లైనింగ్ పనులు వేగవంతంగా జరుగుతున్నాయని, ఏడు నెలల్లో పనులను పూర్తి చేసి సీఎం చేతులమీదుగా ప్రాజెక్టును ప్రారంభించి లక్ష ఎకరాలకు సాగు నీరు అందిస్తామని ఆయన తెలిపారు. రైతు ల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ అనేక పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారన్నారు. అయిటిపాములలో లిఫ్టు ఏర్పాటుకు నిధులు మంజూరు చేసిన సీఎం కేసీఆర్‌కు రైతుల పక్షాన ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కట్టంగూర్, నకిరేకల్ జడ్పీటీసీలు తరాల బలరాములు, మాద ధనలక్ష్మి, మార్కెట్ కమిటీ చైర్మన్ నడికుడి ఉమారాణి, పీఏసీఎస్ చైర్మన్ నూక సైదులు, ఇరిగేషన్ నకిరేకల్ సబ్ డివిజన్ డీఈ భూషణాచారి, ఏఈలు ఆంజనేయులు, పాండు, ఎంపీటీసీ నలమాద వీరమ్మ, టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు నాగరాజు, వెంకన్న, ఆంజనేయులు, గోలి శివ పాల్గొన్నారు.