
యాదాద్రి, ఆగస్టు19: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో గురువారం మహాపూర్ణాహుతి, పవిత్రమాలధారణలతో అర్చకులు పవిత్రోత్సవాలకు పరిసమాప్తి పలికారు. బాలాలయంలో ఉత్సవమూర్తులను నవ కలశాలతో స్వప్న తిరుమంజనం జరిపి దివ్యమనోహరంగా అలంకరించారు. యాగశాలలో స్వామిఅమ్మవార్లను అధిష్ఠింపజేసి పంచసూక్త, మూలమంత్ర హోమపూజలు, మహాపూర్ణాహుతి పర్వాలను నిర్వహించారు. 108నూలు పోగులతో తయా రు చేసిన మాలలను ఊరేగింపు నిర్వహించారు. ప్రధానాలయంలో స్వయంభువులు, బాలాలయంలోని అలంకారమూర్తుల చెంత పూజలుచేసి స్వామిఅమ్మవార్లకు అలంకరించారు. ఈ పర్వాలను దేవస్థాన ప్రధానార్చకులు మోహనాచార్యులు, ఉప ప్రధానార్చకులు కాండూరి వెంకటాచార్యులు, అర్చకులు రంగాచార్యులు, నరసింహమూర్తి, కిరణ్‌కుమారాచార్యులు, లక్ష్మణాచార్యులు నిర్వహించగా కార్యక్రమంలో ఆలయ ఈవో ఎన్. గీత, అనువంశిక ధర్మకర్త బి. నరసింహమూర్తి, ఆలయ అధికారులు గజవెల్లి రమేశ్‌బాబు, శ్రవణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
పాతగుట్టలో..
పాతగుట్ట లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయం లో స్వయంభూవులకు పవిత్రమాలధారణతో అర్చకులు ఉత్సవాలకు ముగింపు పలికారు. యాగశాలలో మూలమంత్ర హవనం జరిపి మహాపూర్ణాహుతిని నిర్వహించారు.
నేటి నుంచి స్వామివారి నిత్యకల్యాణం
పవిత్రోత్సవాల్లో భాగంగా గత రెండు రోజులుగా తాత్కాలికంగా నిలిపేసిన స్వామివారి శ్రీసుదర్శ న నారసింహహోమం, నిత్యతిరు కల్యాణోత్సవా లు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయని ఆలయ అధికారులు తెలిపారు.
యాదాద్రీశుడికి ప్రత్యేక పూజలు
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయం లో గురువారం అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వ హించారు. వేకువజామునే సుప్రభాతంతో స్వా మివారిని మేల్కొలిపిన అర్చకులు బాలాలయ కవచమూర్తులను హారతితో కొలిచారు. ఉత్సవమూర్తులకు అభిషేకం, అర్చనలు చేశారు. తులసీదళాలతో అర్చించి అష్టోత్తర పూజలు జరిపారు. అనంతరం భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. సాయంత్రం వేళ బాలాలయంలో ఉత్సవమూర్తులను దివ్యమనోహరంగా అలంకరించి వెండిజోడు సేవ నిర్వహించారు. స్వామివారికి నిత్యారాధనలు, సహస్రనామార్చనలు శాస్ర్తోక్తంగా జరిగాయి. రాత్రి బాలాలయంలోని ప్రతిష్ఠామూర్తులకు ఆరాధన, సహస్రనామార్చన జరిగాయి. కొండపైన ఉన్న పర్వతవర్ధినీ సమేత రామలింగేశ్వరుడికి అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. పార్వతీదేవిని కొలుస్తూ కుంకుమార్చన జరిపా రు. యాదాద్రి ఆలయంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుపుకొనే సత్యనారాయణ స్వామి వారి వ్రత పూజల్లో భక్తులు పాల్గొని భక్తి శ్రద్ధలతో
పూజలు చేశారు.
స్వామివారి ఖజానాకు రూ.10,60,675 ఆదాయం
స్వామివారి ఖజానాకు రూ.10,60,675 ఆదా యం వచ్చినట్లు ఆలయ ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్‌తో రూ.86,594, రూ.100 దర్శనంతో రూ.65,000, నిత్యకైంకర్యాలతో రూ.400, సుప్రభాతంతో రూ.600, క్యారీబ్యాగులతో రూ.1,930, సత్యనారాయణ స్వామి వ్రతాలతో రూ.66,000, కల్యాణకట్టతో రూ. 23,800, ప్రసాద విక్రయంతో రూ.4,75,140, శాశ్వత పూజల ద్వారా రూ.34,812, వాహన పూజలతో రూ.9,900, టోల్గేట్తో రూ. 1,340, అన్నదాన విరాళంతో రూ.25,122, సువర్ణ పుష్పార్చనతో రూ.80,820, యాదరుషి నిలయంతో రూ.55,850, పాతగుట్టతో రూ. 26,335, టెంకాయల విక్రయంతో రూ. 57,000, ఇతర విభాగాలతో రూ.50,032తో కలుపుకొని రూ.10,60,675 ఆదాయం సమకూరినట్లు ఆమె తెలిపారు.