e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, November 28, 2021
Home జిల్లాలు స్వాతంత్య్ర సంబురం

స్వాతంత్య్ర సంబురం

యాదాద్రి, ఆగస్టు15: ఆలేరు నియోజకవర్గ వ్యాప్తంగా 75వ స్వాతంత్య్ర వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని యాదగిరిగుట్ట పట్టణంలో ప్రభు త్వ, ప్రైవేట్‌ కార్యాలయాలు, పాఠశాలల్లో నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉపాధ్యాయులు జాతీయజెండాను ఎగురవేసి గౌరవ వందనం చేశారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు. యాదగిరిగుట్ట పురపాలక సంఘం కార్యాలయం లో మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ ఎరుకల సుధ, యాదగిరిగుట్ట పోలీస్‌ స్టేషన్‌లో సీఐ జానకీరెడ్డి జెండాను ఎగురవేశారు.పలువురు మాట్లాడుతూ స్వాతంత్య్రం కోసం ప్రాణాలను అర్పించిన వారి ని స్మరించుకోవడం అందరి కర్తవ్యమని అన్నారు.

ఆలేరు పట్టణంలో ..

ఆలేరు పట్టణంలో ఆదివారం మున్సిపల్‌ కార్యాలయంలో చైర్మన్‌ వస్పరి శంకరయ్య, మార్కెట్‌ కార్యాలయంలో చైర్మన్‌ గడ్డమీది రవీందర్‌ గౌడ్‌, తహసీల్‌ కార్యాలయంలో తహసీల్దార్‌ గణేశ్‌నాయక్‌, పోలీసు స్టేషన్‌లో ఎస్సై ఇద్రిస్‌ అలీ, జిల్లా గ్రంథాలయ డైరెక్టర్‌ ఆడెపు బాలస్వామి తదితరులు త్రివర్ణ పతకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు బేతి రాములు, నాగరాణి, చింతలఫణి సునీత, మార్కెట్‌ వైస్‌ చైర్మన్‌ గ్యాదపాక నాగరాజు పాల్గొనారు.

గుండాలలో..

- Advertisement -

గుండాల,ఆగస్టు15: గుండాల తహసీల్‌ కార్యాలయం ఎదుట తహసీల్దార్‌ దయాకర్‌ రెడ్డి, మండల పరిషత్‌ కార్యాలయం ఎదుట వైస్‌ ఎంపీపీ మహేశ్వరం మహేందర్‌ రెడ్డి, టీఆర్‌ఎస్‌ కార్యాలయం ఎదుట మండల అధ్యక్షుడు కుమ్మరి దశరథ, పోలీస్‌స్టేషన్‌ ఎదుట ఎస్సై సందీప్‌ కుమార్‌ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ కొలుకొండ లక్ష్మీ రాములు,జడ్పీ కోఆప్షన్‌ సభ్యుడు ఎండీ ఖలీల్‌,మండల కోఆప్ష న్‌ సభ్యుడు షర్ఫుద్దీన్‌, రైతు సమన్వయసమితి నాయకు లు గడ్డమీది పండరి, గార్లపాటి సోమిరెడ్డి, మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ మందడి రామకృష్ణారెడ్డి, ఎంపీడీవో శ్రీనివాస్‌, ఎంపీవో జనార్దన్‌ రెడ్డి , మండల నాయకులు గోలుకొండ యాదగిరి , సంగి వేణుగోపాల్‌ పాల్గొన్నారు.

బొమ్మలరామారంలో..

బొమ్మలరామారం,ఆగస్టు15: తహసీల్‌ కార్యాలయంలో తహసీల్దార్‌ పద్మసుందరి, పీఏసీఎస్‌ కార్యాలయంలో చైర్మన్‌ గూదె బాలనర్సయ్య జాతీయ జెండా ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో వైస్‌ ఎంపీపీ గొడుగు శోభ, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు పోలగాని వెంకటేశ్‌ గౌడ్‌, ఎంఈవో రంగరాజన్‌,ఎంపీడీవో సరిత, ఎంపీటీసీ కుర్మిండ ఈశ్వర్‌ గౌడ్‌, సర్పంచ్‌లు మేడబోయిన గణేశ్‌, రాంపల్లిమహేశ్‌ గౌడ్‌,వడ్లకొండ అరుణ , దీరావత్‌ మంజుల, పూడూరి నవీన్‌ గౌడ్‌,మచ్చ వసంత,మచ్చశ్రీనివాస్‌గౌడ్‌,ఉపసర్పంచ్‌ జూపల్లి భరత్‌, ఆనంద్‌ చారి, కట్ట శ్రీకాంత్‌, మైలారం రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

తుర్కపల్లిలో..

తుర్కపల్లి, ఆగస్టు 15 : మండలంలోని వివిధ గ్రామాల్లో ఆదివారం 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను ఎగుర వేసి జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సుశీలారవీందర్‌, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.

ఆత్మకూరు(ఎం)లో..

ఆత్మకూరు(ఎం), ఆగస్టు15: మండలంలోని అన్ని గ్రామాల్లో వాడవాడల జాతీయ జెండాలను ఎగురవేసి ఘనంగా స్వాతం త్య్ర వేడుకలను జరుపుకున్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ తండమంగమ్మ, తహసీల్దార్‌ జ్యోతి, జడ్పీటీసీ నరేందర్‌గుప్తా, ఎంపీడీవో రాములు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.ఎంపీపీ మాట్లాడుతూ..సమరయోధుల ఆశయా లను అనుగుణంగా నడుచుకోవాలన్నారు.

ఆర్మీ ఉద్యోగులకు సన్మానం

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మండల కేంద్రానికి చెందిన గుండెగాని వెంకన్న, బత్తిని ప్రదీప్‌లను సర్పంచ్‌ జన్నాయికోడె నగేశ్‌, ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు తీపిరెడ్డి గోపాల్‌రెడ్డి సన్మానించారు.

యాదగిరిగుట్ట మండలంలో..

యాదగిరిగుట్ట రూరల్‌, ఆగస్టు 15 : యాదగిరిగుట్ట మండల వ్యాప్తంగా స్వాతంత్య్ర దినోత్సవాలను ఘనంగా జరుపు కున్నా రు. తహసీల్‌ కార్యాలయంలో తహసీల్దార్‌ అశోక్‌రెడ్డి, జెండాను ఆవిష్కరించారు. ఎంపీడీవో కార్యాలయంతో పాటు పంచా యతీ కార్యాలయాలు, ముఖ్య చౌరస్తాలు, యువజన కార్యాలయాల్లో జాతీయ జెండాను ఎగురవేశారు.

ఆలేరు మండలంలో..

ఆలేరురూరల్‌,ఆగస్టు15: మండలంలో నిర్వహించిన వేడుకల్లో సర్పంచ్‌లు ఆరుట్ల లక్ష్మీప్రసాద్‌, వంగాల శ్రీశైలం, వడ్ల నవ్య, బండ పద్మ, బక్క రాంప్రసాద్‌, కొటగిరి జయమ్మ, ఏసిరెడ్డి మహేందర్‌రెడ్డి, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

మోటకొండూర్‌లో..

మోటకొండూర్‌, ఆగస్టు 15: మండలంలోని ఆయా కార్యక్ర మాల్లో ఎంపీపీ పైళ్ల ఇందిరాసత్యనారాయణరెడ్డి, జడ్పీటీసీ పల్లా వెంకట్‌రెడ్డి, ఎస్సై నాగరాజు, ఎంపీడీవో వీరస్వామి, మండల వ్యవసాయాధికారిని సుజాత, మండల వైద్యాధికారి రాజేందర్‌నాయక్‌, గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్‌ జ్యోతి, తదితరులు జాతీయ జెండాలను ఎగురవేశారు.

రాజాపేటలో..

రాజాపేట, ఆగస్టు 15: మండలంలోస్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. జాతీయ జెండాను ఎగుర వేసి జాతీయ గీతాన్ని ఆలపించారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ గుంటి మధుసూదన్‌రెడ్డి, పాల సంఘం చైర్మన్‌ రాంరెడ్డి, మండల వ్యవసాయాధికారి మాధవి పాల్గొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement