
-యాదాద్రి అగ్రికల్చర్, ఆగస్టు 14
పల్లెల్లో వర్షాకాలం సీజన్లో మాత్రమే దొరికే బోడకాకర కాయల్లో బోలెడు పోషకాలు ఉంటాయి. ఈ సీజన్లో దొరికే బోడకాకర కాయల వంటను తినడానికి ప్రజలు ఎంతో ఆసక్తి చూపుతుంటారు. రుచికి కొంచెం చేదైనా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీంతో బోడకాకర కాయల ధర ప్రస్తుతం రూ. 200 పలుకుతోంది. బోడకాకర క్యాన్సర్, షుగర్, ఒబెసిటీ, చర్మ వ్యాధు లు, దగ్గు, జలు బు, మలబద్దకం నివారణతో పాటు ఇన్ఫెక్షన్లను దూరం చేస్తుంది. ఔషధ గుణా లు పుష్కలంగా ఉన్న బోడకాకర ఒక రకంగా ఆరోగ్యానికి సంజీవనిలా పని చేస్తుంది. బోడ కాకర కాయలు ఆకు పచ్చ రంగులో గుండ్రంగా ఉండి బొడిపెల రూపంలో ఉంటాయి. గర్భిణులకు చాలా మేలు చేస్తుంది. ఇందులో ఉండే ఫాలేట్లు శరీరంలో కొత్త కణాల వృద్ధికి, గర్భస్థశిశువు ఎదుగుదలకు తోడ్పడుతాయి. గర్భిణులు రెండు పూటలా భోజనంలో బోడకాకరను తీసుకుంటే దా దాపు వంద గ్రాముల ఫాలెట్లు శరీరానికి అందుతాయి.
ఇందులో విటమిన్ ఏ, సీ పుష్కలంగా లభిస్తుంది. అధిక ప్రొటీన్లు, పీచు పదార్థాలు ఉంటా యి. శరీరంలో చక్కెర శాతాన్ని తగ్గిస్తుంది. అర్షమొలలతో బాధపడే వారికి ఉపశమనాన్ని కలిగిస్తుంది. డయాబెటిస్‌ను నియంత్రణలో ఉంచుతుంది. శరీరంపై ముడతలు రాకుండా చేస్తుంది. జ్వరం, వైరల్ ఫీవర్ ఉన్న వారు ఈ చెట్టు ఆకు రసాన్ని నీళ్లలో మరిగించి చల్లారాక ఒక గ్లాసు ఆకురసంలో ఒక స్పూన్ తేనె కలిపి తీసుకుంటే వ్యాధులు తగ్గుతాయని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. బోడ కాకర.. ఈ సీజన్లో మాత్రమే లభిస్తుంది. పుష్కలంగా పోషకాలు, ఔషధగుణాలు దండిగా ఉండే ఈ కాకరకు మంచి డిమాండ్ ఉంటుంది. ప్రస్తుతం కిలో 200 పలుకుతున్నా, వినియోగదారులు ఎగబడి కొనుగోలు చేస్తుంటారు.