Transfers | రాష్ట్రంలో నాన్ కేడర్ ఐఏఎస్‌ల బదిలీ.. జలమండలికి ముగ్గురు ఈడీలు
Transfers | రాష్ట్రంలో పలువురు ఐఏఎస్‌లతో పాటు నాన్ కేడర్ అధికారులను కూడా రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్ ఎస్.పంకజను జలమండలి ఈడీగా నియమించింది. ఈ మేరకు సీఎస్ రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు.
Transfers | రాష్ట్రంలో పలువురు ఐఏఎస్‌లతో పాటు నాన్ కేడర్ అధికారులను కూడా రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్ ఎస్.పంకజను జలమండలి ఈడీగా నియమించింది. ఈ మేరకు సీఎస్ రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు.
జీహెచ్ఎంసీని రాష్ట్ర ప్రభుత్వం మూడు ముక్కలుగా విడగొట్టిన నేపథ్యంలో జలమండలిలో మూడు కార్పొరేషన్లకు సంబంధించి వేర్వేరు ఈడీలుగా నియమించారు. ఇప్పటివరకు జలమండలి ఈడీగా ఉన్న ఐఏఎస్ మయాంక్ మిట్టల్‌కు జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్‌గా బదిలీ చేశారు. ఈ నేపథ్యంలో మల్కాజిగిరి కార్పొరేషన్‌కు సంబంధించి జలమండలి ఈడీగా పంకజను నియమించారు. హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌కు సంబంధించి జలమండలి ఈడీగా సామ్రాట్ అశోక్ నామాకు పోస్టింగ్ ఇచ్చారు. అలాగే సైబరాబాద్‌కు సంబంధించి జలమండలి ఈడీగా రంగారెడ్డి రిజిస్ట్రార్‌గా ఉన్న సంతోశ్‌లను కూడా జలమండలి ఈడీలుగా నియమించారు. అలాగే ఉపాధి శిక్షణ శాఖ సహాయ సంచాలకుడిగా ఉన్న శశికిరణాచారిని లోక్ భవన్ జాయింట్ సెక్రటరీగా బదిలీ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

