
ఆసరా పింఛన్ పొందేందుకు కనీస వయసును 57 ఏండ్లకు తగ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు పింఛన్ దరఖాస్తు చేసుకునేందుకు శనివారం మార్గదర్శకాలను విడుదల చేసింది. ఆగస్టు 31వ తేదీ వరకు గడువు ఇచ్చిన ప్రభుత్వం.. ‘మీ సేవ’లో ఉచితంగానే దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది. ప్రస్తుతం జిల్లాలో వివిధ రకాల పింఛన్లను 87,739 మందికి నెలనెలా అందిస్తుండగా, ఇందుకు ప్రతినెలా రూ.19కోట్ల వరకు వెచ్చిస్తున్నది. ఓటరు జాబితా ప్రకారం.. 57 ఏండ్ల వయసు కలిగిన వారు 11,833 మంది ఉన్నట్లు గ్రామీణాభివృద్ధి శాఖ లెక్క తేల్చింది. ప్రస్తుతం ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. దరఖాస్తుల ప్రక్రియ ముగిసిన వెంటనే పరిశీలన జరిపి కొత్త వారికి కూడా పింఛన్లను అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోనున్నది.
యాదాద్రి భువనగిరి, ఆగస్టు 14(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : వృద్ధాప్య పింఛన్(ఆసరా) అర్హత వయసు 65 ఏళ్ల నుంచి 57 ఏళ్లకు ప్రభుత్వం తగ్గించింది. ఈ మేరకు కుటుంబంలో ఒకరిని గుర్తించి అర్హత కలిగిన వారందరికీ పింఛన్లు మంజూరు చేయాలని కొద్ది రోజుల కిందట జరిగిన మంత్రి మండలిలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా జీవో జారీ చేయగా..గురువారం దరఖాస్తు చేసుకునేందుకుగాను మార్గదర్శకాలను విడుదల చేశారు. నెలాఖరు వరకు దరఖాస్తు చేసుకున్నవారి వివరాలను క్షుణ్ణంగా పరిశీలించాక అర్హులను తేల్చి నెలకు రూ.2,016 చొప్పున పింఛన్ అందించనున్నారు.
ఒంట్లో సత్తువ లేక పనులు చేయలేని వృద్ధు లు..కాళ్లు, చేతులు వంకర్లు పోయి ఇంటికే పరిమితమైన దివ్యాంగులు..ఇంటి పెద్దదిక్కును కోల్పోయిన వితంతువులతోపాటు ఒంటరి మహిళలు, చేనేత, గీత కార్మికులకు ప్రతినెలా పింఛన్లను అందించి తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక భరోసా కల్పిస్తున్నది. ఠంచన్‌గా పింఛన్ అందిస్తూ ఆయా కుటుంబాలకు అండగా నిలుస్తున్నది. మానవతా దృక్పథంతో సీఎం కేసీఆర్ రూ.200 ఉన్న పింఛన్‌ను రూ.2,016కు, రూ.500 ఉన్న పింఛన్‌ను రూ.3,016కు పెంచి ఇంటి పెద్దగా ఆదుకుంటున్నారు. ప్రస్తుతం జిల్లాలో వివిధ రకాల పింఛన్లు పొందుతున్న వారి సంఖ్య 87,739 కాగా..వీరికి పింఛన్లు అందించేందుకు ప్రతి నెలా ప్రభుత్వం రూ.19కోట్ల వరకు వెచ్చిస్తున్నది. వృద్ధాప్య పింఛన్ వయసును 57 ఏళ్లకు కుదించడంతో గతంలోనే గ్రామీణాభివృద్ది శాఖ ఓటరు లిస్టు ప్రకారం జిల్లాలో 11,833 మంది ఉన్నట్లు గుర్తించింది. ఈ ప్రకారంగా..జిల్లాలో వృద్ధాప్య ఫించన్లు పొందేవారి సంఖ్య మరింతగా పెరగనుంది. ప్రతి కుటుంబంలో ఒకరికి లబ్ధ్దిచేకూర్చేలా వయస్సును తగ్గించి కొత్తగా దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించడంతో నిరుపేద కుటుంబాల్లో సంతోషాలు విరబూస్తున్నాయి.
అర్హులైన వారు పుట్టిన తేదీ ధృవీకరణ, ఓటరు కార్డు తదితర పత్రాలను దరఖాస్తుతోపాటు జతచేయాల్సి ఉంటుంది. ఈ సేవ/మీ సేవ ద్వారా నిర్ణీత నమూనా ప్రకారం ఈ నెలాఖరులోపుగా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుకు ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని, ప్రభుత్వమే సర్వీసు చార్జిని చెల్లిస్తుందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొన్నది. ఈ ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. వయసు ధ్రువీకరణ పత్రంతో దరఖాస్తు చేసుకుంటే పంచాయతీలు, మున్సిపాలిటీల అధికారులు పరిశీలించి అర్హులను గుర్తిస్తారు. గ్రామాల్లో ఎంపీడీవోలు, మున్సిపాలిటీలలో కమిషనర్లు నిర్ణయం తీసుకుంటారు.
యాదాద్రి భువనగిరి, ఆగస్టు 14(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : 57 ఏళ్లు కలిగిన వారు పింఛన్‌కు దరఖాస్తు చేసుకునేందుకు ప్రభు త్వం మార ్గదర్శకాలను జారీ చేసింది. గ్రామీణ ప్రాంతం వారు రూ.1.50లక్షలు, పట్టణ ప్రాంతం వారు రూ.2లక్షలకు లోబడి వార్షిక ఆదాయం ఉండా లి. 3 ఎకరాల తరి, 7.5 ఎకరాల కంటే తక్కువ ఖుష్కి భూమి కలిగి ఉం డాలి. ప్రభుత్వ ఉద్యో గుల కుటుంబాలు, వృత్తిపరమైన హోదాలో ఉన్న కుటుంబాలు, పెద్ద వ్యాపారాలు కల్గిన వారు, 4 చక్రాల వాహనాలు, భారీ వాహనాలు కలిగి నవారు, కుటుంబంలో ఇతర పెన్షన్లు, ప్రభు త్వం నుంచి గౌరవ వేతనం పొందుతున్న వారు అనర్హులు. అర్హత కలిగిన వారు ఈ నెలా ఖరు వరకు దరఖాస్తు చేసుకోవాలి. దర ఖాస్తుల పరిశీలన తర్వాత పెన్షన్ మంజూరుకు చర్యలు తీసుకుంటాం.
పమేలా సత్పతి, కలెక్టర్