స్నాక్స్‌లోనూ సర్కార్ వివక్షే
రాష్ట్రంలోని ప్రభుత్వ బడులను సర్కారే తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నది. ఈ స్కూళ్లల్లోని విద్యార్థులపై తీవ్ర వివక్ష చూపుతున్నది. పదోతరగతి విద్యార్థులకు ఇచ్చే స్నాక్స్ విషయంలో తాజాగా పాఠశాల విద్యాశాఖ విడుదల చేసిన ఉత్తర్వులే ఇందుకు నిదర్శనం.
- పీఎంశ్రీ స్కూళ్లకు34 రోజులు
- ఇతర ప్రభుత్వ బడులకు 19 రోజులే
- విద్యాశాఖ నిర్ణయంపై టీచర్ల అభ్యంతరం
- ఇప్పటికైనా సవరించాలని విజ్ఞప్తి
హైదరాబాద్, ఫిబ్రవరి 6 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని ప్రభుత్వ బడులను సర్కారే తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నది. ఈ స్కూళ్లల్లోని విద్యార్థులపై తీవ్ర వివక్ష చూపుతున్నది. పదోతరగతి విద్యార్థులకు ఇచ్చే స్నాక్స్ విషయంలో తాజాగా పాఠశాల విద్యాశాఖ విడుదల చేసిన ఉత్తర్వులే ఇందుకు నిదర్శనం. పీఎంశ్రీ స్కూళ్లల్లో 34 రోజులు స్నాక్స్ ఇవ్వాలని.. ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రం 19 రోజులే ఇవ్వాలని ఆదేశించింది. విద్యాశాఖ ఇచ్చిన వివక్షాపూరిత ఆదేశాలపై టీచర్లు మండిపడుతున్నారు. ఇదేం పద్ధతి అంటూ ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రంలో పదోతరగతి వార్షిక పరీక్షలు మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు జరగనున్న విషయం తెలిసిందే. విద్యార్థులను పరీక్షలకు సన్నద్ధం చేయడంలో భాగంగా స్పెషల్ క్లాసులను నిర్వహిస్తుంటారు. వీటికి హాజరయ్యే విద్యార్థులకు విద్యాశాఖ ఉచితంగా స్నాక్స్ సమకూర్చడం ఆనవాయితీగా వస్తున్నది. తాజాగా పీఎంశ్రీ సూళ్లల్లోని విద్యార్థులకు స్నాక్స్ సమకూర్చేందుకు పాఠశాల విద్యాశాఖ అనుతిచ్చింది. ఈ బడుల్లో జనవరి 28 నుంచి మార్చి 10 వరకు మొత్తం 34 రోజుల పాటు స్నాక్స్‌ను సమకూర్చాలన్నది. రాష్ట్రంలో 532 పీఎంశ్రీ స్కూళ్లున్నాయి. వీటిల్లో 46,221 మంది పదో తరగతి చదువుతున్నారు. సాయంత్రం స్పెషల్‌క్లాసులు నిర్వహిస్తున్నందున రూ.2.35 కోట్ల స్నాక్స్ బడ్జెట్‌ను కూడా సర్కారు మంజూరుచేసింది.
జిల్లా పరిషత్, ప్రభుత్వ, మాడల్ స్కూల్స్‌లోని విద్యార్థులకు స్నాక్స్ సమకూర్చేందుకు అనుమతినిస్తూ విద్యాశాఖ ఉత్తర్వులిచ్చింది. ఫిబ్రవరి 16 నుంచి మార్చి 10 వరకు కేవలం 19 రోజులకు స్నాక్స్‌ను సమకూర్చాలని ఉత్తర్వులిచ్చింది. రాష్ట్రంలో 4,303 స్కూళ్లల్లో 1,48,461 విద్యార్థులున్నారు. ఒక్కో విద్యార్థికి రూ.15 చొప్పున 19 రోజుల పాటు సమకూర్చేందుకు స్నాక్స్ కోసం రూ.4.23 కోట్లను విద్యాశాఖ మం జూరు చేసింది. సౌకర్యాలు, నిధుల విడుదల విషయంలోనూ సర్కారు బడులకు ఒక విధంగా, పీఎంశ్రీ స్కూళ్లకు మరోలా విడుదల చేస్తున్నారని, ఇదే తీరును స్నాక్స్ విషయంలోనూ చూపడం దారుణమని ఉపాధ్యాయ సంఘాలు అంటున్నాయి. స్నాక్స్ విషయంలో వ్యత్యాసం చూపడం తగదని తెలంగాణ గెజిటెడ్ హెచ్ఎం అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు రాజభాను చంద్రప్రకాశ్ అన్నారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elon Musk | అమెరికాలో ప్రతి చిన్నారికి SpaceX షేర్ ఇస్తా.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన!
Akhilesh Yadav | బీజేపీ కుట్రపూరితంగా విపక్షాలను ఓట్లను తొలగిస్తున్నది : అఖిలేష్ యాదవ్
Dasoju Sravan | ఎల్‌నినో సంక్షోభం ప్రకృతి వైపరిత్యం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే.. 23 ప్రశ్నలతో దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
Osteoporoses | చిన్న వయసులోనే ఎముకల బలంపై శ్రద్ధ.. ఆస్టియోపోరోసిస్ ముప్పును తగ్గించుకోండిలా..
Ganja Seized | వాహనాల తనిఖీలో ఐదు కిలోల గంజాయి స్వాధీనం..భార్యభర్తల అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

